దేశంలోనే తొలిసారిగా అరుదైన గుర్తింపు పొందిన ఉస్మానియా యూనివర్సిటీ!

హైదరాబాద్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయమైన ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి తన ప్రతిష్టను ఉన్నత స్థాయికి చేర్చుకుంది. ఈ ప్రాచీన విద్యాసంస్థ ఇప్పుడు అంతర్జాతీయస్థాయి గుర్తింపుతో మెరుగులు దిద్దుకుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ద్వారా విద్యా నిర్వహణ, పర్యావరణ రక్షణ, ఇంధన సంరక్షణ, ఆహార భద్రత అనే నాలుగు ముఖ్యమైన రంగాల్లో ఐఎస్‌ఓ సర్టిఫికేషన్లు అందుకోవడం ద్వారా దేశంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా ఉస్మానియా చారిత్రక మైలురాయిని అధిగమించింది.

BIS సర్టిఫికేషన్ లు అందుకున్న ఉస్మానియా యూనివర్సిటీ

ఉస్మానియా క్యాంపస్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ ధ్రువపత్రాలను వైస్ ఛాన్సలర్ ఆచార్య కుమార్ అందుకున్నారు. దక్షిణ ప్రాంత BIS డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సందీప్ కుమార్ కనోజియా చేతుల మీదుగా వైస్ ఛాన్సలర్ ఈ సర్టిఫికేషన్ లు అందుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అంతా ఆనందం వ్యక్తం చేశారు.

Osmania University Achieves Historic ISO Certification in Four Categories - first university in India

భారతీయ విద్యా వ్యవస్థకు ఒక ప్రేరణ

ఇది కేవలం ఒక సర్టిఫికేట్ కాదు, ఉస్మానియా యొక్క నిరంతర కృషి, ఆధునిక ఆలోచనలు, విద్యార్థుల సంక్షేమానికి చేస్తున్న ప్రయత్నాలకు లభించిన గుర్తింపు. వైస్ ఛాన్సలర్ ఆచార్య కుమార్ మాట్లాడుతూ, "ఈ విజయం మా విశ్వవిద్యాలయం కోసం మాత్రమే కాదు, మొత్తం భారతీయ విద్యా వ్యవస్థకు ఒక ప్రేరణ.

అన్ని విషయాలలోనూ ప్రత్యేక శ్రద్ధ

మేము విద్యా ప్రమాణాలను ఉన్నత స్థాయిలో నిర్వహిస్తూ, క్యాంపస్‌ను పచ్చగా ఉంచడం, ఇంధన వనరులను ఆదా చేయడం, విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం వంటి అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. ఈ సర్టిఫికేషన్లు మా ఆచరణాత్మక చర్యలను ధృవీకరిస్తాయి" అని చెప్పారు.


ఒకేసారి నాలుగు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్లు సాధించడం అసాధారణం

BIS అధికారి సందీప్ కుమార్ కనోజియా ఈ సందర్భంగా మాట్లాడుతూ, "పురాతన చరిత్ర కలిగిన ఉస్మానియా వంటి గొప్ప సంస్థ ఒకేసారి నాలుగు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్లు సాధించడం అసాధారణం అన్నారు . ఇది అందరి సమిష్టి కృషి ఫలితమని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలి" అని ప్రశంసించారు.

రైతులకు శుభవార్త.. ఖరీఫ్ సీజన్ రైతు భరోసాకు ముహూర్తం ఖరారు!
రైతులకు శుభవార్త.. ఖరీఫ్ సీజన్ రైతు భరోసాకు ముహూర్తం ఖరారు!

ఉస్మానియాకు అరుదైన గుర్తింపుతో భవిష్యత్ ప్లాన్స్ కు మరింత బలం

ఈ విజయం ఉస్మానియా విద్యార్థులు, మాజీ విద్యార్థులందరికీ చాలా సంతోషం కలిగించింది. ఈ రకమైన గుర్తింపు విశ్వవిద్యాలయం యొక్క భవిష్యత్ ప్రణాళికలకు మరింత బలం చేకూరుస్తుంది. ఆధునిక విద్యా వ్యవస్థలో సుస్థిరత, నాణ్యత ఎంత ముఖ్యమో ఈ సాఫల్యం మనకు గుర్తు చేస్తుంది. ఉస్మానియా ఇలాంటి మరిన్ని విజయాలు సాధించాలని అందరూ ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+