3ఏళ్ల తర్వాత టీ ప్రజలు బాధపడ్తారు: కేఈ, ఏపీ, టీలకు నిధుల విడుదల
అనంతపురం/న్యూఢిల్లీ: దేశంలోనే అత్యున్నత రాజధానికా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంటుందని, మూడేళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు ఎందుకు విడిపోయామా అని బాధపడతారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదివారం అనంతపురం జిల్లాలో అన్నారు. దేశంలోనే గొప్ప రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణ రోడ్డు ట్యాక్స్‌పై గవర్నర్ ఏమీ చేయలేకపోయారని, అందుకే కోర్టును ఆశ్రయించామన్నారు.
విభజనతో ఏపీకి అన్యాయం జరిగింది: చంద్రబాబు
విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో అన్నారు. హైకోర్టు ఏర్పాటుపై కేంద్ర ప్రభత్వం, సుప్రీం కోర్టు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్టు చెప్పారు.

రాజధాని, హైకోర్టు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. జ్యుడీషియల్ అధికారుల సంఖ్య, మౌలిక సదుపాయాల కల్పన పెంపొందించాలన్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1,616 కోట్లు, తెలంగాణకు రూ.915 కోట్లను విడుదల చేసింది. పద్నాలుగవ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు మొదటి విడత నిధులు విడుదల చేసింది. విడుదల చేసిన మొత్తం రూ.37,420 కోట్లు.












Click it and Unblock the Notifications