జగన్‌ సర్కార్‌పై కేంద్రం కనకవర్షం- మరో రూ.4,787 కోట్లు: తక్షణమే విడుదల

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి.. కేంద్రం కనకవర్గాన్ని కురిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంతో ఎలాంటి ఘర్షణ వైఖరికి వెళ్లకుండా తనకు కావాల్సిన పనులన్నింటినీ జగన్ చేయించుకుంటోన్నారు. నిధులను తెప్పించుకుంటోన్నారు.

రెవెన్యూ లోటు బడ్జెట్ కింద కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రాష్ట్రానికి 10,461 కోట్ల రూపాయలను విడుదలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో పోలవరం ప్రాజెక్ట్ కోసం 12,911 కోట్ల రూపాయలను సైతం యుద్ధ ప్రాతిపదికన కేటాయించింది. రాష్ట్రానికి జీవనాడిగా భావించే ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిధులు మంజూరు చేయడంతో పనులు ఊపందుకున్నాయి.

jagan

అదే ఊపులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్వయంగా పోలవరం నిర్మాణ పనులను పర్యవేక్షించారు. గోదావరిలో వరదల కారణంగా కాఫర్‌డ్యామ్ కొట్టుకుపోవడంతో ప్రాజెక్టు నిర్మాణానికి అదనంగా 2,000 కోట్ల రూపాయలను సైతం మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. పాలనాపరమైన అనుమతులను జారీ చేసింది. ఈ 2,000 కోట్ల రూపాయలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి.

jagan

అదే సమయంలో- జగన్ సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం మరో బిగ్ న్యూస్‌ను వినిపించింది. మరో 4,787 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను పంపిణీలో భాగంగా మూడవ విడత కింద 1,18,280 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేయగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 4,787 కోట్ల రూపాయలు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది.

jagan

రాష్ట్రాలు తమ మూల ధన కేటాయింపులను వేగవంతం చేయడానికి, అభివృద్ధి/సంక్షేమానికి సంబంధిత వ్యయాలకు అవసరమైన ఆర్థిక సహాయం చేయడానికిఈ నిధులను విడుదల చేసినట్లు తెలిపింది. ప్రాధాన్యత క్రమంలో చేపట్టిన ప్రాజెక్ట్‌లు, పథకాల కింద వ్యయం చేయడానికి వీలుగా జూన్ నెలకు సంబంధించిన మొత్తాన్ని అడ్వాన్స్ ఇన్‌స్టాల్‌మెంట్‌ కింద విడుదల చేసినట్లు వివరించింది.

రాష్ట్రాలవారీగా ఏపీ- రూ.4,787 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్- రూ.2,078 కోట్లు, అస్సాం- రూ.3,700, బిహార్- 11,897 కోట్లు, ఛత్తీస్‌గఢ్- రూ.4,030 కోట్లు, గోవా- రూ. 457 కోట్లు, గుజరాత్- రూ. 4,114 కోట్లు, హర్యానా- రూ.1,293 కోట్లు, హిమాచల్ ప్రదేశ్- రూ. 982 కోట్లు, జార్ఖండ్- రూ. 3,912 కోట్లు, కర్ణాటక- రూ. 4,314 కోట్లు, కేరళ- రూ. 2,277 కోట్లు, మధ్యప్రదేశ్- రూ. 9,285 కోట్లు, మహారాష్ట్ర- రూ. 7,472 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది.

మణిపూర్- రూ. 847 కోట్లు, మేఘాలయా- రూ.907 కోట్లు, మిజోరం- రూ.591 కోట్లు, నాగాలాండ్- రూ. 673 కోట్లు, ఒడిశా- రూ.5,356 కోట్లు, పంజాబ్- రూ. 2,137 కోట్లు, రాజస్థాన్- 7,128 కోట్లు, సిక్కిం- రూ. 459 కోట్లు, తమిళనాడు- రూ. 4,825 కోట్లు, తెలంగాణ- రూ. 2,486 కోట్లు, త్రిపుర- రూ.837 కోట్లు, ఉత్తరప్రదేశ్- రూ. 21,218 కోట్లు, పశ్చిమ బెంగాల్- రూ. 8,898 కోట్ల రూపాయలను కేంద్రం తాజగా విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఓ నోట్ విడుదల చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+