ఏపీకి 'అమృత్' ఇచ్చిన మోడీ: రూ.1,350 కోట్లు ఖర్చు, 32 సిటీలకు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమృత్ ప్రభుత్వం కింద కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసింది. అటల్ మిషన్ కింద రానున్న మూడేళ్లలో ఏపీలో రూ.1,350 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టనుంది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమృత్ ప్రభుత్వం కింద కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసింది. అటల్ మిషన్ కింద రానున్న మూడేళ్లలో ఏపీలో రూ.1,350 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టనుంది.
కేంద్రం సాయంగా రూ.405 కోట్లు మంజూరు చేశారు. మంచినీటి సరఫరాకు రూ.863 కోట్లు, వరద నీటి నిర్వహణకు రూ.195 కోట్లు, వ్యర్థాల తొలగింపుకు రూ.261 కోట్లు కేటాయించారు. 32 నగరాలలో మౌలిక సదుపాయాలకు అమృత్ పథకం కింద రూ.2,890 కోట్లను ప్రభుత్వం ఏపీకి కేటాయించింది.

కాగా, అమరావతి రైతులకు కేంద్ర బడ్జెట్‌లో ఊరట నిచ్చిన విషయం తెలిసిందే. వారికి మూలధన ఆదాయ పన్ను (కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్) నుంచి మినహాయింపు ఇచ్చింది.
2014 జూన్ 2 (రాష్ట్ర అపాయింటెడ్ డే) నాటికి రాజధాని గ్రామాల్లో భూములున్న వారికి ఇది వర్తిస్తుంది. సీఆర్డీఏ ఇచ్చే భూసమీకరణ యాజమాన్య పత్రాల్ని(ఎల్‌ఓపీసీ) విక్రయించినా, సీఆర్డీఏ నుంచి స్థలాలు రైతుల స్వాధీనంలోకి వచ్చిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి రెండేళ్లలోగా విక్రయించినా పన్ను మినహాయింపు లభిస్తుంది.












Click it and Unblock the Notifications