వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రంపై కేంద్రం సవతి ప్రేమ- దురదృష్టకరమైన నిర్ణయాలు : వైసీపీ ఎంపీల ఆగ్రహం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఆంద్రప్రదేశ్‌ పైన కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని వైసీపీ ఎంపీలు వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర జలశక్తిమంత్రిని సీఎం జగన్ తో సహా ఎంపీలు పలుమార్లు కోరారని ఎంపీలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌..చింతా అనురాధా, వంగాగీత చెప్పుకొచ్చారు. పోలవరం విషయంలో ఇంకా పెండింగ్‌ పెడుతున్నారన్నారు. ఎందుకు ఏపీ పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతున్నారో ఒకసారి ఆలోచన చేయాలని కోరారు. ఇతర జాతీయ ప్రాజెక్టుల పట్ల కేంద్రం ఏవిధంగా నిబంధనలు అనుసరిస్తున్నారో గమనించాలని సూచించారు.

దురదృష్టకరమైన నిర్ణయాలు తీసుకుంటుూ

దురదృష్టకరమైన నిర్ణయాలు తీసుకుంటుూ

పవర్‌ ప్రాజెక్టుల పట్ల దురదృష్టకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. తాగునీటి వాటర్‌ కంపొనెంట్‌ను విడదీస్తూ పార్లమెంట్‌లో జీవో విడుదల చేయడం విచారకరమని పేర్కొన్నారు. ప్రధాని, జలశక్తి మంత్రి తగు చర్యలు తీసుకొని వెంటనే ఈ జీవోను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేసారు. పోలవరం రివర్స్‌కాస్ట్‌ ఎస్టిమేషన్లు విడుదల చేయాలని కోరుతున్నామన్నారు. సీఎం పలుమార్లు లేఖలు రాసినా ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పుకొచ్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టా? కాదా ఒకసారి లోచన చేయాలని డిమాండ్ చేసారు.

తక్షణమే విడుదల చేయాలి

తక్షణమే విడుదల చేయాలి

పోలవరం బకాయిలను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్‌ హెడ్‌క్వార్టర్స్‌ హైదరాబాద్‌లో ఉందని... తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి అన్నింటికి అనువుగా ఉంటుందన్నారు. కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించడం లేదన్నారు. ఎందుకీ సవతితల్లి ప్రేమ చూపుతున్నారో కేంద్రం ఆలోచన చేయాలంటూ సూచించారు. ఆర్‌అండ్‌ ఆర్‌ ప్రాజెక్టు గురించి కేంద్రం ఆలోచన చేయాలి. గిరిజనులకు పరిహారం ఇచ్చే సమయంలో ఎందుకు కేంద్రం ఆలస్యం చేస్తుందో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

రాష్ట్ర ఆలోచన ఇలా ఉంటే..

రాష్ట్ర ఆలోచన ఇలా ఉంటే..

ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఎంపీలు చెప్పుకొచ్చారు. గిరిజనులకు పరిహారం ఇవ్వకుండా నీరు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. కేంద్రం ఈ విషయంలో కూడా ఆలోచన చేయాలని డిమాండ్ చేసారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ నిరుపేదలైన గిరిజనులకు ఇచ్చే విషయంలో అశ్రద్ధ చూపడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రధాని, జలశక్తి మంత్రి ఒక్కసారి ఆలోచన చేయాలని వైసీపీ ఎంపీలు కోరారు.

Recommended Video

Chandrababu Cried Issue : Vallabhaneni Vamsi Apologizes || Oneindia Telugu
ప్రత్యేక హోదా పైన అదే విధంగా

ప్రత్యేక హోదా పైన అదే విధంగా

ప్రత్యేక హోదా అన్నది లాంగ్‌పెండింగ్‌ డిమాండ్‌గా మిలిగిందని... ప్రత్యేక హోదా ఏపీ ప్రజల చిరకాల కోరిక. ఏపీ విడిపోయినప్పుడు ఆ రోజు ప్రధాని పార్లమెంట్‌ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేసారు. ఈ హామీని నెరవేర్చకుండా ఏపీ ప్రజల పట్ల సవతితల్లి ప్రేమను చూపుతున్నారన్నారు. కేంద్రం ఈ విషయంలో కూడా ఆలోచన చేయాలని ఎంపీలుప్రధాని నరేంద్ర మోదీని కోరారు.

English summary
Centre is showing step mother love towards AP said the angry YCP MPS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X