Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చట్టంలో హోదా లేదు: గడగడా చదివిన వెంకయ్య, ఇవ్వాలనే ఉంది కానీ: రాజ్

న్యూఢిల్లీ: విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం లేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం నాడు లోకసభలో చెప్పారు. అయినప్పటికీ తాము ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. హోదా అంశాన్ని చట్టంలో పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు డిమాండ్ చేయడం విడ్డూరమన్నారు.

చట్టంలో పేర్కొన్న విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. చట్టంలో ఇచ్చిన ప్రతి హామీను తాము నెరవేరుస్తున్నామని చెప్పారు. చట్టంలో ఉన్న ప్రకారం.. తమ ప్రభుత్వం ఏర్పడగానే పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోను ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ ఆర్డినెన్స్ తెచ్చామన్నారు.

హోదా అంశాన్ని చట్టంలో చేర్చకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఏపీకి గత ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో తాము చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు. అందుకే ఒక్కటొక్కటిగా హామీలు నెరవేరుస్తున్నామన్నారు.

విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు చేర్చలేదని వెంకయ్య కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. ఈ సందర్భంగా చట్టంలో పేర్కొన్న హామీలను, నెరవేర్చిన హామీలను వెంకయ్య నాయుడు చదివి వినిపించారు. హోదా గురించి అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

చట్టంలోని హామీల విషయంలో, ప్రత్యేక హోదా విషయంలో తమ బాధ్యతలను విస్మరించలేమని చెప్పారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోను తాము వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. ఏపీకి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా కావాలని, అదీ పదేళ్లు కావాలని తాను డిమాండ్ చేసినది నిజమేనని, కానీ చట్టంలో చేర్చకుండా ఇప్పుడు రాద్దాంతం చేయడం ఏమిటన్నారు. ఏపీకి చేసిన సాయాన్ని ఆయన చదివి వినిపించారు. తెలంగాణకు కూడా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు.

Centre Still in Favour of Special Status to Andhra Pradesh: Venkaiah Naidu

కాంగ్రెస్ నాడు సైలెంట్, నేడు వయోలెంట్

ప్రత్యేక హోదా విషయంలో చట్టం రూపంలో తెచ్చేందుకు కాంగ్రెస్ నాడు సైలంట్ అయిందని, అడిగేటప్పుడు మాత్రం వయోలెంటుగా వ్యవహరిస్తోందని వెంకయ్య నాయుడు ధ్వజమెత్తారు. ఏపీకి సహాయం చేసేందుకు కేంద్రం అన్ని విధాలా సిద్ధంగా ఉందని, దయచేసి అర్థం చేసుకోవాలన్నారు.

చట్టంలో ఉన్న ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఆర్ తదితర సంస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీలో ఎన్నో కేంద్ర సంస్థలకు శంకుస్థాపన చేశామన్నారు. చట్టంలో పేర్కొన్న విద్యా సంస్థలు అన్నీ ఏర్పడుతున్నాయన్నారు. స్వాతంత్రం వచ్చాక ఏ ప్రభుత్వం కూడా ఓ రాష్ట్రానికి ఇంతలా సాయం చేయలేదన్నారు.

అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... విభజన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు అమలు కావడం లేదన్నారు. హామీలు ఇచ్చి రెండేళ్లవుతున్నా భర్తీ చేయలేదన్నారు. రాజ్యసభలో హామీలు ఇచ్చినప్పుడు వెంకయ్యే సాక్షి అని చెప్పారు.

గడగడా చదివిన వెంకయ్య

వెంకయ్య ఏపీకి ఇచ్చిన వాటిని గడగడా చదివి వినిపించారు. రాష్ట్రానికి ఐఐటీ, ఐఐఐటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ ఇరిగేషన్ రీసెర్చ్, ఎన్ఐఐటీ, పోలవరం ప్రాజెక్టు, నేషనల్ కాంపిటేటివ్ రీసెర్చ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ లను మంజూరు చేశామన్నారు.

తిరుపతి విమానాశ్రయాన్ని ఇంటర్నషనల్ స్థాయికి తీసుకెళ్లామని, అమరావతి సమీపంలోని విజయవాడ ఎయిర్ పోర్టు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. కాకినాడ కంటెయినర్ కార్పొరేషన్ పనులు జరుగుతున్నాయని, రూ.65 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల అభివృద్ధి పనులను మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదించారన్నారు.

విజయవాడ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డును మంజూరు చేశామన్నారు. పట్టణాభివృద్ధి శాఖ నుంచి గుంటూరు, విజయవాడల అభివృద్ధికి రూ.500 కోట్ల చొప్పున కేటాయించామన్నారు. వైజాగ్, కాకినాడ నగరాలను స్మార్ట్ సిటీలుగా నిర్ణయించామన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలను ప్రత్యేక అభివృద్ధి మండళ్లుగా గుర్తించామని వెంకయ్య తెలిపారు. ఇంత అభివృద్ధి కళ్లముందు కనిపిస్తుంటే, ఈ వ్యతిరేకత ఏమిటన్నారు.

రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన

విభజన సమయంలో చట్టంలో ప్రత్యేక హోదాపై ఒక్క మాటను కూడా చేర్చని కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడిలా రాద్ధాంతం చేయడం తగదని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ హితవు పలికారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాలని తమకూ ఉందని, అయితే, అది అనేకాంశాలతో కూడుకున్నదని తెలిపారు. ఈ విషయమై న్యాయశాఖ పనిచేస్తోందని, న్యాయశాఖ సిఫార్సుల మేరకు నిర్ణయం ఉంటుందని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+