మోడీ సహకరించేనా: చంద్రబాబు కలల రాజధాని ఇలా (పిక్చర్స్)
హైదరాబాద్: జపాన్, సింగపూర్ సహకారంతో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్రానికి కాన్సెప్ట్ పేపర్ పంపించనుంది. అందులో కృష్ణా నదీ అభిముఖంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న నూతన రాజధాని, రాజధానిలోని వాణిజ్య సమూదాయాల ఊహాచిత్రాలను పంపించనుంది. కాన్సెప్ట్ పేపర్ ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది.
దేశంలోనే తొలి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలని ఏపీ భావిస్తోంది. ఇందుకోసం కాన్సెప్ట్ రూపొందించి కేంద్రానికి పంపిస్తుంది. జూన్ రెండో వారంలో విజయవాడకు వాయువ్య దిశలో 12 కి.మీ., గుంటూరుకు ఈశాన్య దిశలో 20 కి.మీ. దూరంలో రాజధాని నగర నిర్మాణానికి పునాది రాయి వేసి భూమి పూజ చేస్తారు. ఆ తర్వాత నిర్మాణాలు సాగుతాయి. రాజధాని గుర్తింపు కోసం టవర్ నిర్మించాలని భావిస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర నిధులతో పాటు అవసరమైన చోట ప్రభుత్వ - ప్రయివేటు భాగస్వామ్యంతో తొలివిడతలో 122 చ.కి.మీ. విస్తీర్ణంలో అభివృద్ధి చేయనుంది. 2019 నుంచి రాష్ట్ర పూర్తిస్థాయి పరిపాలనను నూతన రాజధాని నుండే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. రానున్న ఐదేళ్లలో మొదటి విడతగా రూ.15వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఆ తర్వాత ఐదేళ్లకు దాదాపు ఇరవై వేల కోట్లతో ప్రాజెక్ట్ పూర్తవుతుంది.
రాజధాని నిర్మాణం 40 సెక్టార్లుగా చేపట్టనుంది. ఒక్కో సెక్టారు విస్తీర్ణం 60 నుండి 100 హెక్టార్లు ఉంటుంది. 600 హెక్టార్లలో చేపట్టనున్న ప్రతిపాదిత రాజధాని ప్రాజెక్టు నిర్మాణం తొమ్మిది భాగాలుగా విభజించారు. నిర్మాణానికి గడవు ఉంది. విశాలమైన రహదారులు నిర్మిస్తారు. మెట్రో రైలు ప్రాజెక్టులు ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాలు ఒకే దగ్గర ఉంటాయి.
చంద్రబాబుకు షాక్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు కేంద్రం షాకివ్వనుందని తెలుస్తోంది. ఏపీ రాజధాని కోసం చంద్రబాబు కేంద్రం నుండి భారీగా నిధులు తీసుకు రావాలని చూస్తున్నారు. ఇందు కోసం ఆయన రూ.20వేల కోట్ల వరకు అడుగుతున్నారు. అయితే, కేంద్రం అంత ఇచ్చేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications