చంద్రబాబు పంపిస్తే!: పురంధేశ్వరి, ప్రత్యేక హోదాపై మళ్లీ బిజెపి ట్విస్ట్
విశాఖ/కర్నూలు: రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదని, ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు పంపిస్తే నిధుల మంజూరుకు తాము కృషి చేస్తామని మాజీ కేంద్రమంత్రి, బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆదివారం అన్నారు.
ఆమె కర్నూలు జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీల వైపే అన్ని రాష్ట్రాలు మొగ్గు చూపుతున్నాయని చెప్పారు.
ఆమె కర్నూలు జిల్లా నంద్యాలలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం రూ.63వేల కోట్ల సాయం అందించేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. అందులో రూ,24వేల కోట్లు ఇచ్చిందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి పంపిస్తే కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు.

ముందు ముందు కూడా ఏ రకమైన సహకారం కావాలన్నా కేంద్రం వెనుకాడేది ఉందని చెప్పారు. కేంద్రం మంచి ప్యాకేజీ ఇస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే నిధుల మంజూరుకు మేం కూడా కృషి చేస్తామన్నారు.
విశాఖపై దృష్టి: చంద్రబాబు
విశాఖపట్నం సుందరీకరణ పైన దృష్టి పెడుతున్నామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం విశాఖలో చెప్పారు. ఆయన విశాఖలో పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విశాఖ పోర్టు ప్రాంతంలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రాజెక్టుల పనులు వేగవంతానికి అధికారులను ఆదేశించామని చెప్పారు. విశాఖలో టూరిజం, విద్యాభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామన్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ పెరగాలన్నారు.












Click it and Unblock the Notifications