హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైద్రాబాద్ నిర్ణయం కేంద్రానిదే: కావూరి, మావల్లే: అశోక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavuri Sambasiva Rao
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు పైన నిర్ణయాన్ని కేంద్రమే తీసుకుంటుందని కేంద్ర జౌళీశాఖ మంత్రి కావూరి సాంబశివ రావు బుధవారం అన్నారు. విభజన అంశానికి హైదరాబాదు చిక్కుముడిగా ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాదు లేని తెలంగాణ ఒప్పుకునేది లేదని తెలంగాణవాదులు చెబుతుండగా, హైదరాబాదును అందరం కలిసి అభివృద్ధి చేశామని, ఇప్పుడు తమను వెళ్లిపోమంటే ఎలా అని సమైక్యవాదులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కావూరి హైదరాబాదు పైన కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

బిల్లు వ్యతిరేకిస్తాం: కిల్లి కృపారాణి

పార్టీల నిర్ణయమే అంతిమ నిర్ణయం కాదని మరో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి అన్నారు. ప్రజల అభీష్టం మేరకు తాము పార్లమెంటులో బిల్లును అడ్డుకుంటామని చెప్పారు. సమైక్యవాదులు తన అతిథి గృహాన్ని ముట్టడించిన సమయంలో ఆమె స్పందించారు.

మా వల్లే నోట్ ఆగింది: అశోక్ బాబు

తమ ఒత్తిడి వల్లనే తెలంగాణపై కేబినెట్ నోట్ ఆగిందని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు విజయవాడలో అన్నారు. హైదరాబాదులో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించే అవకాశం లేకుండా పోయిందని అందుకే విజయవాడలో నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు.

తాము గాంధేయ మార్గంలో ఉద్యమం చేస్తున్నామన్నారు. రాజకీయ నేతల వ్యాఖ్యల్లో ఉద్యోగుల ప్రస్తావన వద్దని కోరారు. తమ ఒత్తిడి వల్లనే తెలంగాణ నోట్ పైన కేంద్రం కొంత తగ్గిందన్నారు. నోట్ పేరిట ఇరు ప్రాంతాల ప్రజలను మభ్యపెడుతున్నారని కేంద్రంపై మండిపడ్డారు.

ప్రజలను మోసం చేయకుండా ఏదో ఒక నిర్ణయం చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో తాము ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. సమైక్య ప్రకటన వచ్చే వరకు ఉద్యమం ఆపేది లేదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ మహాత్ముడికి అశోక్ బాబు వినతి పత్రం ఇచ్చారు.

English summary

 Central Minister Kavuri Sambasiva Rao on Wednesday said Centre will take decision on Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X