వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవియం ల పై ఆందోళ‌న వ‌ద్దు : 362 ఇవియం ల‌తోనే సాంకేతిక స‌మస్య‌లు : సీఈవో ద్వివేదీ

|
Google Oneindia TeluguNews

ఏపిలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ లో ఇవియం లు ప‌ని చేయ‌టం లేదంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వ‌స్తున్నాయి. దీని పై రాజ కీయ పార్టీలు ఇసి పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. టిడిపి అధినేత చంద్ర‌బాబు దీని పైనే ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసారు. ఇవియం లు ప‌ని చేయ‌ని చోట రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేసారు. అయితే, దీని పై ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి వివ‌ర‌ణ ఇచ్చారు. కేవ‌లం 362 ఇవియం ల్లో మాత్ర‌మే స‌మ‌స్య వ‌చ్చింద‌ని వివ‌రించారు.

ఏపిలో ఇవియం ల పై ఫిర్యాదులు..
ఏపి మొత్తంగా 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 91 చోట్ల ఇవియం ల స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లు ఫిర్యాదులు వెల్లు వెత్తుతున్నాయి. ఏపి లోని మంగ‌ళ‌గిరి, తాడికొండ‌, విజ‌య‌వాడ తూర్పు, అన‌కాప‌ల్లి వంటి ప్రాంతాల్లో ఇవియం ల స‌మ స్య కార‌ణంగా పోలింగ్ ఆల‌స్యంగా ప్రారంభ‌మైంది. దీని పై టిడిపి అదినేత చంద్ర‌బాబు నేరుగా ఎన్నిక‌ల ప్ర‌ధానాధికా రికి లేఖ రాసారు. 30 శాతం ఇవియం లు ప‌ని చేయ‌టం లేద‌ని లేఖ‌లో పేర్కొన్నారు. మంగ‌ళ‌గిరి వైసిపి అభ్య‌ర్ది అక్క‌డ ఇవియం ల స‌మ‌స్య కార‌ణంగా ఓట‌ర్లు తిరిగి వెళ్లిపోతున్నారంటూ ఓట‌ర్ల తో క‌లిసి ధ‌ర్నాకు దిగారు. దీంతో, రాష్ట్ర ఎన్ని క‌ల ప్ర‌ధానాధికారి రాష్ట్ర వ్యాప్తంగా ఇవియం ల స‌మ‌స్య పై స‌మీక్షించారు. జిల్లాల వారీగా నివేదిక‌లు తెప్పించుకున్నా రు. సాంకేతిక సిబ్బందిని అందుబాటులో ఉంచాల‌ని అదేశించారు.

CEO Dwivedi given clarity on EVMs problem : out of 45900 only 362 EVMs facing trouble

45900 ఇవియంలు ఉంటే 362 మాత్ర‌మే ప‌ని చేయ‌టంలేదు
ఏపి లో మొత్తంగా 45900 ఇవియం ల‌ను ఎన్నిక‌ల కోసం వినియోగిస్తున్నామ‌ని..అందులో కేవ‌లం 362 ఇవియం ల‌తో నే స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ద్వివేదీ వెల్ల‌డించారు. ఇవియం ల పై వ‌స్తున్న ఫిర్యాదుల పై త‌క్ష‌ణం స్పందించాల‌ని ఆర్వోల‌ను ఆదేశించారు. ఒక పార్టీకి ఓటు వేస్తుంటే మ‌రో పార్టీకి వెళ్తుంద‌నే ఫిర్యాదుల పైనా స్పందించారు. అటువంటి అవ‌కాశం లేద‌ని..అయినా ప్ర‌తీ పోలింగ్ బూత్ వ‌ద్ద సాంకేతిక సిబ్బంది అందుబాటులోనే ఉన్నార‌ని ద్వివేదీ వివ‌రించారు. ఏ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇవియం ల కార‌ణంగా పోలింగ్ నిలిచి పోయే ప‌రిస్థితి లేద‌ని స్ప‌ష్టం చేసారు. సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు లైన్ల‌లో ఉన్న ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసారు. కొన్ని చోట్ల స్వ‌ల్ప సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయ‌ని..నివేదిక‌లు కోరామ‌ని వెల్ల‌డించారు.

English summary
many complaints on EVM's in Ap polling. AP Elections CEO respond on these complaints and clarified that out of 45900 problem with only 362 evms. No where polling stopped due to EVM's problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X