వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర్ రావు

|
Google Oneindia TeluguNews

Ch Vidyasagar Rao is Governor of Maharashtra
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది.

అదే విధంగా గోవా గవర్నర్‌గా మృధుల సిన్హా, కర్ణాటక గవర్నర్‌గా విఆర్ వాలా, రాజస్థాన్ గవర్నర్‌గా కళ్యాణ్ సింగ్‌లు నియమితులయ్యారు. నాలుగు రాష్ట్రాల గవర్నర్ల నియమానికి సంబంధించిన ఫైలుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ఉదయం ఆమోద ముద్ర వేశారు.

మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన సిహెచ్ విద్యాసాగర్ రావు రెండు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కేంద్ర సహాయమంత్రిగా కూడా ఆయన పని చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యే కూడా ఆయన గెలుపొందారు.
కాగా, ఇప్పటి వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న కె శంకర నారాయణన్‌ను మిజోరాం రాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్రపతి భవన్ శనివారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

మిజోరాం గవర్నర్‌గా వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేసిన ఆయన ఆదివారం గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్ర గవర్నర్ పదవి ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగర్ రావును నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది.

కరీంనగర్‌లో సంబరాలు

విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులు కావడంతో కరీంనగర్‌లో బిజెపి నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. విద్యాసాగర్ రావు నిజాయితీని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించడం తమకు సంతోషంగా ఉందని నాయకులు తెలిపారు.

English summary
Bharatiya Janata party senior leader CH Vidyasagar Rao appointed as Maharashtra Governor on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X