విశాఖలో చడ్డీ గ్యాంగ్ హల్‌చల్: జనం ఆందోళన
విశాఖపట్నం: నగరంలో చెడ్డీ గ్యాంగ్ కదలికలు ప్రజలను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. నగర శివార్లలోని పోతిన మల్లయ్యపాలెంలోని పనోరమా హిల్స్‌లో 66 నెంబర్ విల్లా వద్ద ఈ గ్యాంగ్ సంచరించినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది.
ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చెడ్డీ గ్యాంగ్ సభ్యుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఈ విల్లా యజమాని లక్ష్మీనారాయణ హైదరాబాద్ నివాసి అని పోలీసులు తెలిపారు.

అప్పుడప్పుడు విశాఖ వచ్చి వెళ్తుంటారు. ఈ విల్లాలో చోరీకి యత్నించినప్పటికీ వీలుకాకపోవడంతో చెడ్డీగ్యాంగ్ అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ విల్లాలో చోరీ జరగనప్పటికీ.. చెడ్డీగ్యాంగ్ గతంలో నగర శివార్లలో దొంగతనాలకు పాల్పడిన ఘటనలున్నాయి.
వీరిని పట్టుకుంటే నగరంలో జరిగిన దొంగతనాలకు సంబంధించిన ఆధారాలు దొరికే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. చెడ్డీ గ్యాంగ్ ఆట కట్టించి, రక్షణ కల్పించాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా ఇంతకుముందు చెడ్డీ గ్యాంగ్ సంచరించినట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి.












Click it and Unblock the Notifications