Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రజల మధ్యలో లోకేష్: చంద్రబాబు రోడ్‌షో (పిక్చర్స్)

ఖమ్మం: టైటానియం స్కాంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ కెవిపి రామచంద్ర రావు అవినీతి బట్టబయలైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో నిర్వహించిన సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. కెవిపి అరెస్ట్‌కు అమెరికా రెడ్ కార్నర్ నోటీస్ పంపిందని తెలిపారు. రూ.110 కోట్ల లంచాల సొమ్మును మనీలాండరింగ్ ద్వారా రాష్ట్రానికి తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లు గెలుచుకుంటామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రోజుకో మాట చెప్పే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రావును ప్రజలు నమ్మరన్నారని అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాందించి జైలుకెళ్లిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చేస్తారని బాబు ప్రశ్నించారు.

వైఎస్ ఆత్మ కెవిపి అరెస్ట్‌కు ఇంటర్‌పోల్ సిద్ధంగా ఉందని తెలిపారు. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం రాబోతోందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్న టిడిపిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు, ఉపాధి అకాశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌కు వద్దు, కెవిపి జైలుకే: లోకేష్

రంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన చెయ్యి మనమే నరుక్కోవాల్సి వస్తుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ అన్నారు. గురువారం రాత్రి రంగారెడ్డి జిల్లాలోని మణికొండలో యువ ప్రభంజనంలో లోకేష్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతిమయమైన కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యొద్దని పిలుపునిచ్చారు. టైటానియం కుంభకోణంలో కెవిపి జైలు కు వెళ్లక తప్పదని హెచ్చరించారు. కెవిపి లాంటి నాయకులు రాష్ట్రానికి అవసరమా అని లోకేష్ ప్రశ్నించారు.

బాబు ప్రసంగం

బాబు ప్రసంగం

టైటానియం స్కాంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ కెవిపి రామచంద్ర రావు అవినీతి బట్టబయలైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు.

రోడ్‌షోకు హాజరైన జనం

రోడ్‌షోకు హాజరైన జనం

ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో నిర్వహించిన సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. కెవిపి అరెస్ట్‌కు అమెరికా రెడ్ కార్నర్ నోటీస్ పంపిందని తెలిపారు.

కెసిఆర్‌ను నమ్మరు

కెసిఆర్‌ను నమ్మరు

ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లు గెలుచుకుంటామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రోజుకో మాట చెప్పే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రావును ప్రజలు నమ్మరన్నారని అన్నారు.

టిడిపి టోపీలతో చిన్నారులు

టిడిపి టోపీలతో చిన్నారులు

గురువారం రాత్రి రంగారెడ్డి జిల్లాలోని మణికొండలో యువ ప్రభంజనంలో లోకేష్ పాల్గొని ప్రసంగించారు.

ప్రజల మధ్యలో..

ప్రజల మధ్యలో..

కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన చెయ్యి మనమే నరుక్కోవాల్సి వస్తుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ అన్నారు.

రోడ్‌షోలో జనం

రోడ్‌షోలో జనం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్న టిడిపిని గెలిపించాలని ప్రజలకు లోకేష్ విజ్ఞప్తి చేశారు.

లోకేష్ ప్రసంగం

లోకేష్ ప్రసంగం

టైటానియం కుంభకోణంలో కెవిపి జైలు కు వెళ్లక తప్పదని హెచ్చరించారు. కెవిపి లాంటి నాయకులు రాష్ట్రానికి అవసరమా అని లోకేష్ ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+