గంటలో 30 తులాల బంగారం మాయం, విద్యార్ది మృతి

నెంబర్లు లేని బైక్‌లపై వచ్చిన దొంగలు 12 గంటల నుంచి 1 గంటలోపు ఈ చోరీలకు పాల్పడ్డారు. ఎస్ఆర్ నగర్ సమీపంలోని ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో నడుచుకుంటూ ఒంటరిగా వెళ్తున్న రజని అనే మహిళ మెడలోని 3 తులాల బంగారు గొలుసు, పీకేగూడలో శ్యామల అనే వృద్దురాలి మెడలోని 6 తులాల బంగారు గొలుసును వారు తెంచుకుపోయినట్లు ఎస్ఆర్ నగర్ పోలీసులు వెల్లడించారు.
ధరంకరణ్ రోడ్డులో విజయలక్ష్మీ అనే మహిళ మెడ నుంచి 15 తులాల బరువు గల రెండు బంగారు గొలుసులను, మధురానగర్ లోని వెంకమ్మ అనే వృద్దురాలి మెడలోని 6 తులాల బంగారు గొలుసును చోరీ చేశారు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులు దొంగల కోసం వెతుకలాట ప్రారంభించారు.
పాఠశాలలో విద్యార్ది ఆకస్మిక మృతి
వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ ఓ పాఠశాలలో విద్యార్ది ఆకస్మిక మృతి. తరగతి గదిలోని మృతి చెందిన ఆరోగతి విద్యార్ది ప్రణవ్ ఆదిత్య.












Click it and Unblock the Notifications