లావుగా ఉండి..తంతాం అంటే భయపడం : ఎప్పుడు వస్తావో చెప్పు : నాగబాబుకు రఘురామ రాజు సవాల్..!
Recommended Video

ఎన్నికల వేళ సవాళ్లు...ప్రతి సవాళ్లతో ఉత్కంఠ వాతావరణం ఏర్పడుతోంది. నర్సాపురం లోక్‌సభ అభ్యర్దులుగా ఉన్న రెండు పార్టీలకు చెందిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఇకరి పై మరొకరు సవాళ్లు చేసుకుంటున్నారు. జనసేన నేత నాగ బాబు తంతాం అంటే భయపడే వారు లేరని..ఎప్పుడు వస్తావో చెప్పాలంటూ రఘురామ రాజు సవాల్ చేసారు.
వాపును బలుపు అనుకోవద్దు..
నర్సాపురం ఎంపి అభ్యర్దులు వ్యక్తిగత సవాళ్లకు దిగుతున్నారు. జనసేన నేత నాగబాబు ఓటమి భయంతో పిచ్చి పిచ్చి గా మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు తీవ్రస్థాయిలో విరు చుకుపడ్డారు. వాపును చూసి బలుపు అనుకోవద్దని, ఎన్నికల రోజు ప్రజలు ఎవరివైపు ఉన్నారో తెలిసిపోతుందని, ప్రజా తీర్పు వచ్చేవరకూ వేచి ఉండాలన్నారు. ఇంత లావుగా ఉంటే తంతాం...అంటే భయంతో ఇక్కడ చూస్తూ ఊరుకొనేవా రు ఎవరూ లేరన్నారు. నేను పార్టీలు మారడం కాదు... నా సొంత గూటికి తిరిగి వచ్చాను. నేను ఎప్పుడైనా ఒకదాని త ర్వా త క్కటే కండువా వేసుకున్నా... కానీ మీరు ఏడు కండువాలు ఒకేసారి వేసుకుని తిరుగుతున్నారన్నారు. సీపీఎం, సీపీఐ, ఏనుగు నడుముకు పచ్చ కండువా చివరికి కేఏ పాల్ కండువా ఇలా ఏడు వేసుకున్నారని ఎద్దేవా చేసారు.

మీకు సినిమా చూపిస్తాం..
ఎప్పుడు వస్తావో చెప్పు నాగబాబు, ఛాలెంజ్. నన్ను తంతావో లేదో చూద్దాం రండి. మీకు సినిమా చూపిస్తాం అంటూ రఘు రామ రాజు ఫైర్ అయ్యారు. ఊరులో లైబ్రరీ పెట్టుకుంటాం అంటే ఉమ్మడి ఆస్తుల పేరుతో అడ్డుకొని అమ్ముకు న్న వ్యక్తి నాగబాబు... ఆయన గురించి జిల్లాలో ఎవరికైనా తెలుసు. ఎన్నికల కోసమే మళ్లీ వచ్చారని కూడా ప్రజలకు తెలుసన్నారు. విలువల గురించి మీరా మాట్లాడేది..ప్రజా సమస్యలు అంటే ఇవేనా.. ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి చాలు అని సూచించారు. నాగబాబు తీరు వల్ల... మీ సోదరులు మీద ఉన్న గౌరవం, పరువు పోతోందన్నారు. ఇక మీరు మీ తమ్ముడు పవన్ కులాల మధ్య చిచ్చు పెట్టొద్దు. రెండు రాష్ట్రాల మధ్య శాంతి చెడగొట్టవద్దు. మీరు ప్రశాంతంగా మీ ప్రచారం చేసుకోండి. ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, ప్రశాంతమైన జిల్లాలో శాంతిగా ఉండండని సూచించారు.
ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ (ఫొటోలు)
ప్రతిష్ఠాత్మకంగా మారుతున్న ఎన్నిక..
నర్సాపురం ఎంపి సీటు కోసం ఈ ఇద్దరు పోటీ పడుతున్నారు. గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనసేన నుండి నాగబాబు ను గెలిపించే బాధ్యత పవన్ కళ్యాన్ తీసుకున్నారు. ఆయన సైతం ఇదే లోక్‌సభ నియోజకవర్గ పరిధి లోని భీమవరం నుండి పోటీ చేస్తున్నారు. అక్కడ తాను గెలవటంతో పాటుగా తన అన్నకు భారీ మెజార్టీ అక్కడి నుండే ఇవ్వాలనేది పవన్ లక్ష్యం. ఇక, ఇదే సమయంలో నర్సాపురం లో క్షత్రియ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకొనేందు కు రఘు రామ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. సమీప బంధువు బాపిరాజు కాంగ్రెస్ నుండి పోటీ లో ఉన్నారు. ఇక, కాపు వర్గం నుండి బిజెపి నుండి మాణిక్యాల రావు పోటీకి దిగారు. టిడిపికి రాజీనామా చేసి వైసిపి లో చేరిన కొత్తపల్లి సు బ్బారాయుడు ఈ నియోజకవర్గంలో ప్రభావితం చేయగలరు. ఆయన రాక ఇప్పుడు వైసిపికి అదనపు బలం.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications