జాబ్ క్యాలెండర్ కోసం ఛలో తాడేపల్లి.. జగన్ ఇంటి వద్ద భద్రత పెంపు, కొనసాగుతున్న అరెస్ట్ లు !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళన బాట పట్టారు. వైసీపీ సర్కార్ ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపింది. ఇక ఈ జాబ్ క్యాలెండర్ ను వ్యతిరేకిస్తూ నిరుద్యోగులు, విద్యార్థులు కదం తొక్కుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువత ఏపీ ప్రభుత్వంపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు.
Recommended Video

సీఎం జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన విద్యార్ధి, యువజన సంఘాలు
రెండు లక్షల 30 వేల పోస్టులు ఖాళీగా ఉంటే, కేవలం 10 వేల ఉద్యోగాలను కల్పించడంపై సీరియస్ గా ఉన్న నిరుద్యోగులు, విద్యార్ధి, యువజన సంఘాల నాయకులు ఈరోజు చలో తాడేపల్లి పేరుతో సీఎం జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. అన్ని పార్టీల విద్యార్థి, యువజన సంఘాలు, నిరుద్యోగ సంఘాలు ప్రభుత్వం కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి ఎన్నికల సమయంలో ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తాడేపల్లి లో సీఎం నివాసం వద్ద భద్రత పెంపు
తాడేపల్లి పెట్రోల్ బంక్ నుండి సీఎం జగన్ నివాసానికి వెళ్లే దారిలో నాలుగు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఆ మార్గంలో వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సీఎం జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇక నిరుద్యోగులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్న టిడిపి నేతలను సైతం, తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నేతలను సైతం పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

కొనసాగుతున్న అరెస్ట్ లు , గృహ నిర్బంధాలు
గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగు యువత, టిఎన్ఎస్ఎఫ్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. వారిని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక ఆందోళనలో పాల్గొనడానికి టిడిపి నేతలు ప్రయత్నిస్తారని ఎక్కడికక్కడ వారిని గృహనిర్బంధం చేస్తున్నారు. అనంతపురం లో జేసీ పవన్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద ముందస్తుగా మోహరించిన పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేశారు. అంతేకాదు అటు తిరుపతిలోనూ ఛలో సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరిన తెలుగుదేశం అనుబంధ సంఘాల నేతలను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
జగన్ ఇంటి ముట్టడికి అనుమతి లేదన్న పోలీసులు .. కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్
సీఎం జగన్ ఇంటి ముట్టడి అనుమతి లేదని చెబుతున్న పోలీసులు చట్టాలను అతిక్రమించి ముట్టడికి ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జారీ చేస్తున్నారు. అంతేకాదు సీఎం నివాస పరిసరాల్లో భారీగా బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు రాజధానిలో రైతు నేతలకు సైతం సీఆర్పీసీ సెక్షన్ 149 కింద నోటీసులు జారీ చేశారు . పోలీసుల తీరు పట్ల విద్యార్థి యువజన సంఘాల నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కావాలనే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, సంబంధం లేని వారిని కూడా అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ తీరుపై నిరుద్యోగుల అసహనం .. 2.30 లక్షల ఉద్యోగాల కొత్త జాబ్ క్యాలెండర్ డిమాండ్
జగన్ సర్కార్ జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వ నిరుద్యోగులను మోసం చేస్తోందని విద్యార్థి యువజన సంఘాల నాయకులు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఖాళీగా ఉన్న 2లక్షల 30 వేల పోస్టులను తక్షణం భర్తీ చేయాలని, పదివేల పోస్టులతో జారీచేసిన జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి, కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదిలా ఉంటే నిరుద్యోగ యువత కోసం ఒకపక్క జనసేన, మరోపక్క తెలుగుదేశం పార్టీ జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఒత్తిడి పెంచుతున్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications