కన్నం వేసి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్‌లో చోరీ
హైదరాబాద్: హైదరాబాదులోని కూకట్‌పల్లి చందన బ్రదర్స్ షోరూమ్‌లో భారీ దొంగతనం జరిగింది. పక్క భవనం నుంచి కన్నం వేసి షోరూమ్‌లోకి ప్రవేశించిన దొంగలు రూ. 15 లక్షల నగదు, 40 తులాల బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. షోరూమ్ ముందు ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉండగానే చోరీ జరగటం గమనార్హం.
చోరీ జరిగిన తీరుని పరిశీలిస్తే దొంగలు ముందుగానే రెక్కీ నిర్వహించి ఉంటారని తెలుస్తోంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేపీహెచ్‌బీకాలనీ ఎదురుగా జాతీయ రహదారి పక్కన చందన బ్రదర్స్ షోరూమ్ ఉంది. షోరూమ్‌కి ఓ పక్క జయరాంరెడ్డి కాంప్లెక్స్, మరోపక్క జీఆర్‌టీ జువెలరీ షోరూమ్ ఉంది. జయరాంరెడ్డి కాంప్లెక్స్ మొదటి అంతస్తులో ముందు వైపు ఒక బ్యాంక్ శాఖ ఉంది. మిగతా భవనం కొన్ని సంవత్సరాలుగా ఖాళీగానే ఉంది. ఈ భవనం వెనుక వైపు నుంచి దొంగలు పైకి వ్రవేశించారనటానికి పక్కా ఆధారాలు కనిపిస్తున్నాయి.
భవనం వెనుక నుంచి మొదటి అంతస్తులోకి ప్రవేశించిన దొంగలు పైకి చేరుకున్నారు. వాడుకలో లేకుండా దుమ్ము కొట్టుకుపోయిన ఈ భవనం కారిడార్‌తో పాటు మెట్ల పైన దొంగలు నడుచుకుంటూ వెళ్లిన కాలిముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దొంగలు తిరిగి వెళ్లిన ముద్రలు కనిపించటం లేదు. దీంతో పైకి వెళ్లి చోరీకి పాల్పడ్డ దొంగలు ఏ మార్గంలో పరారయ్యారనేది ప్రశ్నార్ధకంగా మారింది. జయరాంరెడ్డి కాంప్లెక్స్ భవనం పైకి వెళ్లిన దొంగలు చందన బ్రదర్స్ భవనం పైకి వెళ్లటానికి పెద్ద ఇనుప నిచ్చెన ఉపయోగించారు.

చందన బ్రదర్స్‌లో చోరీ
హైదరాబాదులోని కూకట్‌పల్లిలో గల చందన బ్రదర్స్ షాపింగ్ మాల్‌లో పకడ్బందీగా దొంగతనం జరిగింది. నగదు, బంగారం ఎత్తుకెళ్లారు.

చందన బ్రదర్స్‌లో చోరీ
హైదరాబాదులో కూకట్‌పల్లిలో గల చదన బ్రదర్స్ షాపింగ్ మాల్‌లో పకడ్బందీగా చోరీ చేయడానికి రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

చందన బ్రదర్స్‌లో చోరీ
ఖాళీగా ఉన్న ఓ భవనం వెనుక వైపు నుంచి దొంగలు పైకి వ్రవేశించి, వెనక నుంచి కన్నం వేసి చందన బ్రదర్స్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు.

చందన బ్రదర్స్‌లో చోరీ
జయరాంరెడ్డి కాంప్లెక్స్ భవనం పైకి వెళ్లిన దొంగలు చందన బ్రదర్స్ భవనం పైకి వెళ్లటానికి పెద్ద ఇనుప నిచ్చెన ఉపయోగించారు.

చందన బ్రదర్స్‌లో చోరీ
భవనం వెనుక నుంచి మొదటి అంతస్తులోకి ప్రవేశించిన దొంగలు పైకి చేరుకున్నారు. వాడుకలో లేకుండా దుమ్ము కొట్టుకుపోయిన ఈ భవనం కారిడార్‌తో పాటు మెట్ల పైన దొంగలు నడుచుకుంటూ వెళ్లిన కాలిముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

చందన బ్రదర్స్‌లో చోరీ
షోరూమ్ భవనం పైకి చేరుకున్న దొంగలు గోడను పగులగొట్టి లిఫ్ట్‌లోకి ప్రవేశించారు. అక్కడి నుంచి ఒక అంతస్తు దిగి తర్వాత మెట్ల మీదుగా మొదటి అంతస్తులోకి చేరుకున్నారు.
షోరూమ్ భవనానికి మరో పక్కన ఉన్న జీఆర్‌టీ జువెలరీ భవనానికి మరమ్మతుల కోసం కింది నుంచి పైకి వెళ్లటానికి వీలుగా కర్రలతో దడి కట్టి ఉంచారు. అక్కడ పని కోసం సిబ్బంది ఉంచిన నిచ్చెనను దొంగలు చోరీ కోసం ఉపయోగించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షోరూమ్ భవనం పైకి చేరుకున్న దొంగలు గోడను పగులగొట్టి లిఫ్ట్‌లోకి ప్రవేశించారు. అక్కడి నుంచి ఒక అంతస్తు దిగి తర్వాత మెట్ల మీదుగా మొదటి అంతస్తులోకి చేరుకున్నారు.
అక్కడి డ్రాలోని రూ. 15 లక్షల నగదు, ఓ బ్యాగ్‌లో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. పక్కనే ఉన్న మరో బ్యాగ్‌లో ఎక్కువ మొత్తంలో బంగారు ఆభరణాలున్నప్పటికీ దొంగలు దాన్ని వదిలి వెళ్లటం అనుమానాలకు తావిస్తోంది. బుధవారం రాత్రి 11 గంటలకు షోరూమ్ మూసే వరకు పనిచేసిన సీసీ కెమెరాలు ఆ తర్వాత పనిచేయలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే సీసీ కెమెరాలు పనిచేయలేదని పేర్కొంటున్నారు. ఇది కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. చోరీకి కనీసం రెండు గంటల సమయం పట్టి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
కన్నం వెయ్యటానికి దొంగలు ఉపయోగించిన రెండు సుత్తెలు, ఎడ్జస్టబుల్ రెంచ్, ఇతర పరికరాలు జయరాంరెడ్డి భవనం పైనే ఉన్నాయి. దీన్ని బట్టి దొంగలు చోరీ తర్వాత ఇదే భవనం పైకి వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు షోరూమ్ తెరిచిన తర్వాత చోరీ జరిగిందన్న విషయాన్ని నిర్వాహకులు గుర్తించారు. షోరూమ్ మేనేజర్ కృష్ణమూర్తి ఫిర్యాదుతో కూకట్‌పల్లి ఏసీపీ సాయిమనోహర్, కేపీహెచ్‌బీ సీఐ శ్రీకాంత్‌గౌడ్ దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌టీమ్, పోలీసు జాగిలాలను రప్పించి ఆధారాలు సేకరించారు.












Click it and Unblock the Notifications