టీడీపీ విజ‌యాన్ని ఏ శ‌క్తి ఆప‌లేదు ..చంద్ర‌బాబు అల‌ర్డ్‌: కూల్‌గా జ‌గ‌న్ : ప‌వ‌న్ ఎక్క‌డ‌..!

కౌంటింగ్ వేళ‌..టీడీపీ అధినేత చంద్ర‌బాబు నేత‌ల‌ను..కేడ‌ర్‌ను అల‌ర్ట్ చేస్తున్నారు. టెలికాన్ఫిరెన్స్ ద్వారా మ‌రోసారి టీడీపీ విజ‌యం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేసారు. టీడీపీ విజ‌యాన్ని ఏ శ‌క్తీ అప‌లేద‌ని చెప్పుకొచ్చారు. ఇదే స‌మ‌యం లో వైసీపీ అధినేత జ‌గ‌న్ కూల్‌గా క‌నిపిస్తున్నారు. ఎటువంటి హ‌డావుడి లేకుండా ఫ‌లితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ అమ‌రావ‌తిలోనే ఉన్నా..ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ నేత‌ల‌కు అందుబాటులోకి రాలేదు..

టీడీపీ గెలుపును ఆప‌లేరు..

టీడీపీ గెలుపును ఆప‌లేరు..

మ‌రి కొద్ది సేప‌ట్లో వెల్ల‌డికానున్న ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ విజ‌యాన్ని ఏ శ‌క్తీ అప‌లేద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ధీమా వ్య‌క్తం చేసారు. కొద్ది సేప‌టి క్రితం ఆయ‌న పార్టీ నేత‌ల‌తో..కౌంటింగ్ ఏజెంట్ల‌తో టెలి కాన్ఫిరెన్స్ నిర్వ‌హించారు. కౌంటింగ్ సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై నేతలకు దిశానిర్ధేశం చేశారు. ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడినా సంయమనం పాటించాలంటూ పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. అలాగే, చివరి వరకు కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలని టీడీపీ ఏజెంట్లను ఆదేశించారు. పోలింగ్ జ‌రిగిన నాటి నుండి చంద్ర‌బాబు ఇదే ధీమాతో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డైన స‌మ‌యంలోనూ వారు ఏపీ ఓట‌ర్ల నాడి ప‌ట్టుకోవ‌టంలో విఫ‌ల‌మ‌య్యార‌ని ఆరోపించారు. మ‌రి ..చంద్రబాబు అంచ‌నాలు ఎంత వ‌ర‌కు స‌ఫ‌లం అవుతాయో మ‌రి కాసేప‌ల్లో తేలిపోనుంది.

 కూల్‌గా వైసీపీ అధినేత‌..

కూల్‌గా వైసీపీ అధినేత‌..

ఏపీలో పోలింగ్ ముగిసిన త‌రువాత నుండి వైసీపీ అధినేత జ‌గ‌న్ చాలా కూల్‌గా క‌నిపిస్తున్నారు. పోలింగ్ ముగిసిన నాడు పోలింగ్ స‌ర‌ళి పైన స్పందిస్తూ తాము లాండ్ స్లైడ్ విక్ట‌రీ సాధిస్తున్నామ‌ని ధీమా వ్య‌క్తం చేసారు. ఆ త‌రువాతి నుండి ఇప్ప‌టి వ‌ర‌కూ ఫ‌లితాల పైన మాట్లాడ‌లేదు. కౌంటింగ్ ముందు రోజు సాయంత్రం ఉండ‌వల్లి లోని త‌న నివాసానికి చేరుకున్న జ‌గ‌న్ అక్క‌డి నుండి కౌంటింగ్‌ను స‌మీక్షిస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గెలుపు ఖాయ‌మ‌నే ధీమాతో ఉన్న జ‌గ‌న్ పార్టీ సీనియ‌ర్ల‌తో మాత్రం ట‌చ్‌లో ఉన్నారు. కౌంటింగ్ ముందు అభ్య‌ర్దుల‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన జ‌గ‌న్‌..ఎక్క‌డా టెన్ష‌న్ ప‌డ‌టం లేదు. ఫ‌లితాలు వెల్ల‌డ‌యిన త‌రువాత మాత్ర‌మే జ‌గ‌న్ స్పందించ‌నున్నారు. ఇప్ప‌టికే వైసీపీ నేత‌లు త‌మ గెలుపు ఖాయ‌మ‌నే న‌మ్మ‌కంతో జ‌గ‌న్ నివాసానికి చేరుకుంటున్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాన్ ఎక్క‌డ‌...

ప‌వ‌న్ క‌ళ్యాన్ ఎక్క‌డ‌...

ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ ఇచ్చిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ ఫ‌లితాల స‌ర‌ళిని ఎక్క‌డి నుండి ప‌ర్య‌వేక్షిస్తార‌నేది ఇంకా స్ప‌ష్ట‌త రాలేదుద‌. ఆయ‌న విజ‌య‌వాడ వ‌చ్చార‌ని చెబుతున్నా..పార్టీ కార్యాల‌యం లేదా ఇంటి నుండి ఫ‌లితాల‌ను స‌మీక్షిస్తారా అనేది స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. ఫ‌లితాలు ఎలా ఉన్నా..మార్పు మొద‌లైంద‌ని..దానిని కొన‌సాగించ‌ట‌మే త‌మ ల‌క్ష్యం అని ప‌వ‌న్ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసారు. అయితే, జ‌న‌సేన ఎవ‌రి ఓట్ల‌కు గండి కొట్టింది..ఎటువంటి ప్ర‌భావం చూపించింద‌నేది మాత్రం ఆస‌క్తి క‌రంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+