టీడీపీ అభ్యర్దుల్లో చంద్రబాబు కొత్త మార్పులు - ఎవరెక్కడ..!!

ఏపీలో ఎన్నికల రాజకీయంగా రసవత్తరంగా మారుతోంది. అభ్యర్దుల ఎంపికలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పొత్తుల్లో భాగంగా జనసేనకు 3 ఎంపీ, 24 అసెంబ్లీ స్థానాలను ఖరారు చేసారు. బీజేపీ తో సీట్ల పంపకాల పైన చర్చ సాగుతోంది. ఇదే సమయంలో టీడీపీ నుంచి ఖరారు చేయాల్సిన అభ్యర్దుల పైన దాదాపు నిర్ణయానికి వచ్చారు. పెండింగ్ లో ఉంచిన సీనియర్ల స్థానాల పైన క్లారిటీ ఇచ్చారు. మార్పులు చేర్పులు చేస్తున్నారు.

అభ్యర్దుల ఖరారు
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సారి గెలుపు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. పొత్తుల వేళ అభ్యర్దుల ఎంపికపైన ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అధికారికంగా ప్రకటించని స్థానాల్లో ఖరారైన అభ్యర్థులకు ఆంతరంగికంగా సంకేతాలు పంపి పనిచేసుకోవాలని సూచిస్తున్నారు. గురజాలలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును ఖరారు చేసారు. నియోజకవర్గంలో పని చేసుకోవాలని యరపతినేనికి సూచించారు. నరసరావుపేటలో ప్రస్తుత ఇన్‌చార్జి డాక్టర్‌ అరవింద బాబువైపే టీడీపీ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.. కర్నూలు జిల్లా ఆలూరు అభ్యర్థిగా స్థానిక నేత వీరభద్ర గౌడ్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు ఈ సీటుకు కోట్ల సుజాత ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆమె భర్త కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి ఈసారి డోన్‌ టికెట్‌ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయంతో సుజాత తప్పుకున్నారు.

Chandra Babu Almost finalised conteting candidates list for up coming Elections details here

మార్పులు - చేర్పులు
చిత్తూరు లోక్‌సభ అభ్యర్థిగా దగ్గుమళ్ల ప్రసాదరావు ఖరారైనట్లు సమాచారం. ఆయన ఆదాయపు పన్ను శాఖలో ఉన్నత స్థానంలో పనిచేసి రిటైరయ్యారు. ఆ సీటును ఎస్సీల్లో మాదిగ ఉప కులానికి ఇవ్వాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దగ్గుమళ్లను చిత్తూరు పంపాలని నిర్ణయించారు. ఆయన కూడా అందుకు అంగీకరించారు. బాపట్ల లోక్‌సభ అభ్యర్థిపై ఇంకా నిర్ణయం జరగలేదు. జనసేనకు ఇచ్చిన నియోజకవర్గాలకు చెందిన కొందరు టీడీపీ నేతలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలిపించి మాట్లాడారు. తాడేపల్లిగూడేనికి చెందిన వలవల మల్లికార్జునరావు (బాబ్జీ), తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్‌ గొల్ల నరసింహ యాదవ్‌, అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణను పరిస్థితులను వివరించారు.

పొత్తుల వేళ కొత్త లెక్కలు
కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి అచ్చెన్నాయుడిని కలిశారు. అక్కడ ఆయన రాఘవేందర్‌ నుంచి పోటీ ఎదుర్కొంటున్నారు. తనకే అవకాశం కల్పించాలని తిక్కారెడ్డి కోరినట్లు సమాచారం. పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోతున్నప్పుడు సీనియర్లు సహకరించాలని అచ్చెన్నాయుడు కోరారు. కొందరు నేతలు అంగీకరించారు. మరి కొందరు ఇంకా తమకు ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే, బీజేపీతో పొత్తు ఫైనల్ అయిన తరువాత ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ రాత్రిలోగా బీజేపీతో పొత్తు, ఎన్డీఏలో టీడీపీ చేరిక పైన స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో, ఢిల్లీ కేంద్రంగా తీసుకొనే నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+