చంద్రబాబు - పవన్ కీలక నిర్ణయం, రిపీట్ కాకూడదు..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమిలోని మూడు పార్టీల కేడర్ భారీ అంచనా లు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పైన టీడీపీ -జనసేన మధ్య సోషల్ మీడియా కేంద్రంగా వార్ జరిగింది. జరిగిన నష్టాన్ని గుర్తించిన రెండు పార్టీలు ఇక ఆ అంశం పైన స్పందించవద్దని ఆదేశా లు ఇచ్చాయి. ఇదే సమయంలో బీజేపీ ఏపీ ల బలోపేతం కావటం పైన కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దీంతో.. ఇక, మూడు పార్టీల కేడర్ కు నామినేటెడ్ పదవుల అంశం పైన చంద్రబాబు - పవన్ ఒక నిర్ణయానికి వచ్చారు. మూడు పార్టీలకు ఎంత శాతం పదవులు ఇవ్వాలో డిసైడ్ చేసారు.
చంద్రబాబు - పవన్ కసరత్తు
నామినేటెడ్ పదవుల జాబితాల ప్రకటన తరువాత వచ్చిన స్పందనలతో రెండు పార్టీల అధినేత లు అప్రమత్తం అయ్యారు. గతంలో జరిగిన ఎంపికతో వచ్చిన సమస్యలు రిపీట్ కాకుండా ఎవరికి అవకాశం ఇవ్వాలనే దాని పైన ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు భారీ సంఖ్యలో నామినేటెడ్ పదవుల ప్రకటనకు రంగం సిద్దమైంది. సంక్రాంతి లోగానే నియామకాలు పూర్తి చేయాలని తొలుత భావించారు. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిమాండ్ తో ప్రస్తుతం సహకార సొసైటీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక వర్గాల నియామకంపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి వీటికి నామినేటెడ్ పాలక మండళ్లు నియమించాలని నిర్ణయించింది.

రాష్ట్ర స్థాయి పదవులు
రాష్ట్రంలో వ్యవసాయ సహకార ప్రాథమిక సొసైటీలు 2,200 ఉన్నాయి. ఇవిగాక మత్స్యకార సొసైటీలు, చేనేత సొసైటీలు వంటి వాటికి కూడా పాలక మండళ్లను నియమించాల్సి ఉంది. వీటికి ఎగువన జిల్లా స్థాయిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్, జిల్లా మార్కెటింగ్ సొసైటీలు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార బ్యాంక్ లకు పాలకవర్గాలను నియమించాల్సి ఉంది. ఇప్పటికే వీటిల్లో నియామకాల పైన ఎమ్మెల్యేల నుంచి పేర్లను తీసుకున్నారు. ఈ పదవుల్లో 80 శాతం టీడీపీ, 15 శాతం జనసేన, 5 శాతం బీజేపీకి ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ల నుంచి వచ్చిన పేర్ల పైన అధ్యయనం పూర్తి చేసిన తరువాత నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
తుది కసరత్తు
అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600 మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నియమిం చాల్సి ఉంది. ఈ నియామకాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని కూటమి నేతలు నిర్ణయించారు. అదే విధంగా మార్కెట్ యార్డు కమిటీల నియామకాల పైన కసరత్తు కొనసాగుతోంది. మూడు పార్టీల్లో ఎమ్మెల్యేల సీట్లు త్యాగం చేసిన వారికి రాష్ట్ర స్థాయి పదవులు కేటాయించనున్నారు. జనసేన, బీజేపీ నుంచి ఇప్పటికే జాబితాలు ముఖ్యమంత్రికి చేరాయి. మరో విడత చర్చల తరువాత వచ్చే నెల తొలి వారంలో భారీ సంఖ్యలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications