వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రస్తుత ఎన్నికల్లో గెలుపు పై చంద్రబాబు ఆసక్తికర విశ్లేషణ. 2014 గుర్తు తెచ్చుకోండంటున్న బాబు. !

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ap Assembly Election 2019 : గెలుపు పై చ‌ంద్ర‌బాబు చేస్తున్న విశ్లేష‌ణ ఇదే || Oneindia Telugu

ఏపిలో ఎన్నిక‌లు ముగిసాయి. ఎవ‌రికి ఎన్ని సీట్లు వ‌స్తాయ‌నే దాని పై చ‌ర్చ మొద‌లైంది. వైసిపి అధినేత త‌మ‌ది లాండ్ స్లైడ్ విక్ట‌రీ అని చెప్పుకొచ్చారు. టిడిపి అధినేత చంద్ర‌బాబు అస‌లు నేనేందుకు ఓడిపోతాను..ప్ర‌జ‌లు ఓట్లు వేసింది మీరు చూడ‌లేదా..మాకు 150 ప్లస్ అని చాలా ధీమా గా చెబుతున్నారు. అయితే, పార్టీ నేత‌ల‌లో చంద్ర‌బాబు చేస్తున్న విశ్లేష‌ణ ఆస‌క్తి క‌రంగా ఉంది.. ఓటింగ్ స‌ర‌ళి పై ఆయ‌న చేస్తున్న విశ్లేష‌ణ ఏంటంటే...

<strong>తొలి విడ‌త ఎన్నిక‌ల‌తో న‌ష్టం జ‌రిగిందా : బాబు మాటల్లో ప‌ర‌మార్దం ఏంటి : వైసిపి చెబుతుందేంటి..!</strong>తొలి విడ‌త ఎన్నిక‌ల‌తో న‌ష్టం జ‌రిగిందా : బాబు మాటల్లో ప‌ర‌మార్దం ఏంటి : వైసిపి చెబుతుందేంటి..!

 ఓట‌ర్లు మా వైపే..ఆ స‌ర‌ళి అర్దం కాదు..

ఓట‌ర్లు మా వైపే..ఆ స‌ర‌ళి అర్దం కాదు..

ఏపిలో పోలింగ్ రోజున రాత్రి పులివెందుల నుండి హైద‌రాబాద్ లోట‌స్ పాండ్ కు చేరుకున్న వైసిపి అధినేత జ‌గ‌న్ ఎన్నిక‌ల స‌ర‌ళి పై స్పందించారు. త‌మ‌కు లాండ్ స్లైడ్ విక్ట‌రీ ఖాయ‌మ‌ని..ప్ర‌మాణ స్వీకార ముహూర్తం దేవుడు నిర్ణ‌యిస్తాడ‌ని చెప్పుకొచ్చారు. ఆ త‌రువాత అర్ద‌రాత్రికి టిడిపి అధినేత చంద్ర‌బాబు త‌మ‌కు 130 సీట్లు వ‌స్తాయంటూ పార్టీ నేత‌ల టెలి కాన్ఫిరెన్స్ లో చెప్పుకొచ్చారు. ఆ త‌రువాత రోజు మీడియా స‌మావేశంలో చంద్ర‌బాబు పోలింగ్ స‌ర‌ళి పై ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేసారు. పోలింగ్ మీకు అర్దం కాదు..మ‌హిళ‌లు..వృద్దులు అంత పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన వారు ఓటు వేసేందుకు పోటెత్తారు. వారంతా జ‌గ‌న్ కోసం వ‌స్తారా..జ‌గ‌న్ గొప్ప‌తనం ఏంటి.. జ‌గ‌న్ కు ఎందుకు ఓటు వేస్తారు..అంటూ టిడిపి అధికారంలోకి రావ‌టం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేసారు. అదే స‌మ‌యం లో మే 23 త‌రువాత మంచి ముహూర్తం చూసుకొని ప్ర‌మాణ స్వీకారం చేస్తాన‌ని చెప్పుకొచ్చారు.

సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయింది

సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయింది

ఇక‌, పోలింగ్ స‌ర‌ళి పై పార్టీ నేత‌ల‌తో స‌మీక్ష స‌మ‌యంలో చంద్ర‌బాబు ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేసారు. మ‌హిళ‌లు.. వృద్దులు టిడిపి కే ఓటు వేసార‌ని..ప‌సుపు కుంకుమ‌, పెన్ష‌న్ల పెంపు ప్ర‌భావం మ‌హిళ‌ల పై భారీగా ఉంద‌ని చంద్ర‌బాబు విశ్లేషించారు. ఇక‌, మోదీ..కేసీఆర్..జ‌గ‌న్ క‌లిసి చంద్ర‌బాబు పై దాడి చేస్తున్నార‌నే ప్ర‌చారం ప్ర‌జ‌ల్లోకి బాగా వెళ్లింద‌ని మ‌రి కొంద‌రు పార్టీ సీనియ‌ర్లు అభిప్రాయ‌ప‌డ్డారు. చంద‌బ్రాబు ను ఒంట‌రి చేసి..కుట్రలు చేస్తున్నార‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డింద‌ని..అది కూడా టిడిపికి ఓట‌ర్లు అండ‌గా నిల‌వాల‌నే సంక‌ల్పానికి దోహ‌దం చేసింద‌ని ఓ సీనియ‌ర్ మంత్రి అభిప్రాయ ప‌డ్డారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే పోల‌వ‌రం..అమ‌రావ‌తి ఆగిపోతాయ‌నే భావ‌న చాలా మందిలో ఉంద‌ని..అందు కోస‌మే జ‌గ‌న్ ఒక్క చాన్స్ అనే నినాదం కంటే అభివృద్ది కోసం టిడిపికి ఓటు వేసార‌ని ప‌లువురు సీని య‌ర్ల‌తో చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది.

వైసిపి 2014 లోనూ ఇలాగే చేసింది

వైసిపి 2014 లోనూ ఇలాగే చేసింది

ఇక‌, వైసిపి అధినేత జ‌గ‌న్ త‌మ‌కు లాండ్ స్లైడ్ విక్ట‌రీ అని చెప్పిన మాట‌ల మీదా టిడిపి లో చ‌ర్చ సాగింది. అయితే టిడిపి అధినేత చంద్ర‌బాబు మాత్రం జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అభిప్రాయ ప‌డ్డారు. 2014 ఎన్నిక‌ల త‌రువాత కూడా ఇదే ర‌కంగా వైసిపి అధికారంలోకి వ‌స్తుందంటూ ప్ర‌చారం చేసుకున్నార‌ని..ఆ తరువాత ఫ‌లితాలు ఏ ర‌కంగా వ‌చ్చాయో చూసామంటూ చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ప్ర‌ధానంగా ప‌సుపు కుంకుమ లబ్ది దారులు, సామాజిక పెన్ష‌న్లు అందుకున్న వారు, ఇత‌ర ప్రాంతాల నుండి వ‌చ్చిన వారు టిడిపికే ఓటు వేసార‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. పోలింగ్ రోజు మ‌ధ్నాహ్నం వ‌ర‌కు వైసిపికి అనుకూలంగా ట్రెండ్ క‌నిపించినా ఆ త‌రువాత టిడిపికి అనుకూలంగా మారింద‌నేది టిడిపి అంత‌ర్గ‌త విశ్లేష‌ణ‌.

English summary
TDP and YCP on huge expectations on winning in elections. TDP Chief says once again voter given chance for him to continue development. YCP Chief Jagan says his party will get land slide victory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X