రాజ్యసభకు మెగా, నందమూరి వారసులు - అనూహ్య ఎంపిక..!!
ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు. వైసీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఇప్పటికే రాజీనామా చేసారు. వారి ఖాళీల భర్తీకి ఏపీలో కూటమి పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ముగ్గురు సభ్యుల ఎంపిక పైన చంద్రబాబు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. పవన్, బీజేపీతో నాయకత్వం తో చర్చించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రెండు టీడీపీ, ఒకటి జనసేనకు ఇవ్వాలని భావించినా.. మూడు పార్టీలకు ఒక్కో సీటు ఖరారు దిశగా నిర్ణయం జరిగినట్లు సమాచారం. ఇక, అభ్యర్ధుల ఖరారు దాదాపు కొలిక్కి వచ్చింది.
పెద్దల సభకు మెగా బ్రదర్
వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి, మస్తాన రావు, క్రిష్ణయ్య రాజీనామా చేసారు. వీరిలో మస్తాన రావు, మోపిదేవి టీడీపీలో చేరారు. మస్తాన రావుకు తిరిగి రాజ్యసభ ఇస్తామనే హామీ ఉంది. ముగ్గురూ బీసీ వర్గాలకు చెందిన వారు కావటంతో ఇప్పుడు కొత్తగా రాజ్యసభకు పంపేవారి విషయంలో కూటమి నేతలు ఆచి తూచి ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో కూటమికి పూర్తి బలం ఉండటంతో మూడు స్థానాలు వీరికే దక్కనున్నాయి. అందులో భాగంగా జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు పేరు దాదాపు ఖరారైంది. చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే మినహా నాగబాబు తన అన్నయ్య చిరంజీవి తరహాలో పెద్దల సభకు వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది.

చంద్రబాబు కసరత్తు
టీడీపీ నుంచి పలువురు రాజ్యసభ రేసులో ఉన్నారు. అందులో భాగంగా నందమూరి సహాసిని పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ భవిష్యత్ ప్రయోజనాలు.. నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత దిశగా ఈ ప్రతిపాదన పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో పార్టీ నుంచి గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్ రావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, టీడీపీ నుంచి ఈ సారి బీసీకి అవకాశం ఇస్తారని.. కొత్త వారికి కాకుంటే తిరిగి మస్తాన రావునే టీడీపీ నుంచి ఎంపిక చేస్తారని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు.

మూడు పార్టీలకు ఛాన్స్
ఇక, బీజేపీకి ఒక స్థానం ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. త్వరలో వైసీపీ నుంచి మరో రాజ్యసభ సభ్యుడి రాజీనామా ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నారు. అదే జరిగితే బీజేపీకి అవకాశం ఇస్తామని టీడీపీ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే.. బీజేపీకి ఈ మూడు స్థానాల్లోనే ఒకటి ఇవ్వాలని తాజాగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీకి సీటు ఖాయమైతే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి దక్కే ఛాన్స్ ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే, టీడీపీ నుంచి పోటీ ఎక్కువగా ఉండటంతో..రెండు స్థానాలు దక్కించుకునేలా మిత్రపక్షాలను ఒప్పించే ప్రయత్నం జరుగుతోంది. దీంతో, అభ్యర్ధుల తుది ఎంపిక పైన మూడు పార్టీల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications