చంద్రబాబు - పవన్ భేటీలో కీలక నిర్ణయం, ముహూర్తం ఫిక్స్..!?

టార్గెట్ జగన్. టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేనాని పవన్ మరోసారి భేటీ అయ్యారు. సుమారు గంటన్నరపాటు ఈ సమాలోచనలు జరిగాయి. ఒన్ టు ఒన్ సమావేశంలో పొత్తుతో పాటుగా బీజేపీ వ్యవహార శైలి పైన చర్చలు చేసారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల పైన చర్చించారు. లోకేష్ పాదయాత్ర సమయంలో, పవన్ వారాహి గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకులతో జరిగిన చర్చల గురించి చంద్రబాబుకు పవన్ వివరించారు. ఇదే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

చంద్రబాబు - పవన్ కల్యాణ్ భేటీ : 2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించటమే లక్ష్యంగా మరోసారి చంద్రబాబు - పవన్ కల్యాణ్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇద్దరు నేతలే ఓపెన్ గా అన్ని అంశాల పైన కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది. రెండు పార్టీలకు చెందిన ఇతర నేతలెవరూ లేరు. తాజాగా పవన్ కల్యాన్ ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు.

 cbnpk

ఆ సమయంలో ఏపీలో బీజేపీ, జనసేనతో పాటుగా టీడీపీతోనూ కలిసి వెళ్లేలా ప్రతిపాదన చేసారు. 2014 ఎన్నికల తరహాలో పొత్తుల ద్వారా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా, అదే సమయంలో మూడు పార్టీలకు మేలు జరిగేలా కార్యచరణ వివరించారు. దీని పైన బీజేపీ నుంచి స్పష్టత రాలేదని సమాచారం. ఇప్పుడు చంద్రబాబుతో ఢిల్లీ చర్చల సారాంశం భవిష్యత్ ప్రణాళికపైనా చర్చలు చేసారు.

కర్ణాటక ఎన్నికల తరువాత : బీజేపీ నాయకత్వం ఇప్పుడు పూర్తిగా కర్ణాటక ఎన్నికల్లో నిమగ్నమైంది. ఈ సమయంలో ఎటువంటి ప్రతిపాదనలు..చర్చలకు అవకాశం లేదని ఇద్దరు నేతలు నిర్దారణకు వచ్చారు. మరి కొంత కాలం బీజేపీ నిర్ణయం కోసం వేచి చూడాలని డిసైడ్ అయ్యారు. కర్ణాటక ఎన్నికల తరువాత మరోసారి బీజేపీ నేతలతో చర్చల కోసం ఢిల్లీకి వెళ్లి చర్చలు చేస్తానని పవన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో కర్ణాటక ఎన్నికల్లో పవన్ ప్రచారం గురించి చర్చ జరిగినట్లు సమాచారం.

బీజేపీ నాయకత్వం కోరితే పవన్ ప్రచారానికి వెళ్లే ఆళోచనలో ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ నిర్ణయం తీసుకొనే వరకూ రెండు పార్టీల పొత్తు గురించి అధికారికంగా ప్రకటన కోసం తొందర అవసరం లేదని ఇద్దరు నేతలు నిర్ణయానికి వచ్చారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ తన సంక్షేమ పథకాలే అస్త్రంగా ఎన్నికల బరిలోకి దిగుతున్న సమయంలో అమలు చేయాల్సిన వ్యూహాల పైన చర్చించినట్లు తెలుస్తోంది.

 cbnpk

మహానాడు వేదికగా : కర్ణాటక ఎన్నికల తరువాత బీజేపీ బలం పైన ఆ పార్టీ నేతలు ఒక అంచనాకు వస్తారని, ఆ తరువాత పొత్తుల విషయంలో సానుకూలత రావచ్చని ఈ ఇద్దరు నేతల్లో చర్చల్లో అభిప్రాయంగా సమాచారం. బీజేపీ మే 13 తరువాత ఇద్దరు నేతలు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఇటు క్షేత్ర స్థాయిలో చేయించిన సర్వేలు, ప్రజాభిప్రాయం పైన ఇద్దరు నేతలు చర్చించారని చెబుతున్నారు.

వైసీపీ తమ రెండు పార్టీల పైన చేస్తున్న ప్రచారం తిప్పి కొట్టటంతో పాటుగా, ప్రధాన ఓటు బ్యాంకుగా జగన్ భావిస్తున్న వర్గాలను తమ వైపు తిప్పుకోవటం కోసం కొత్త వ్యూహాలు అమలు చేయాలని నిర్ణయించారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పైన పొత్తుల పై క్లారిటీ వస్తే ప్రకటన చేయాలని భావిస్తున్నారు. మే ద్వితీయార్ధంలో బీజేపీ కలిసి వస్తూ మూడు పార్టీల పొత్తు, లేకుంటే టీడీపీ-జనసేన పొత్తుతో పాటుగా పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పైన ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఆ వెంటనే పార్టీ మహానాడులో పొత్తుల పై న ప్రకటన చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+