చంద్రబాబును కదలించిన దేవాన్ష్..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనవడిని గెలిపించారు. సీఎంగా నిత్యం బిజీగా ఉండే చంద్ర బాబుకు తన మనవడి నుంచి ఫోన్ రాగానే హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. దేవాన్ష్ తాను చెస్ టోర్న మెంట్ లో ఆడుతున్నానని.. తనకు మద్దతుగా నిలవాలంటూ ఫోన్ చేయటంతో చంద్రబాబు కదిలి వెళ్లారు. టోర్నమెంట్‌లో డిస్క్‌ను వేగంగా పూర్తి చేయడంతోపాటు 127 కదలికలతో దేవాన్ష్ ఈ రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు కు చెస్ అంటే ఆసక్తి. ఇటీవల జరిగిన ఒక ప్రముఖ చెస్ టోర్నమెంట్‌లో దేవాన్ష్ వరల్డ్ రికార్డు కోసం ప్రయత్నం చేసాడు. ఆ సమయంలో తన కోసం రావాలంటూ చంద్రబాబుకు ఫోన్ చేసారు. వరల్డ్ రికార్డు అటెంప్ట్‌ని తన తాత సమక్షంలో చేయాలని అనుకున్నాడు దేవాన్ష్. తాత తన వెంట ఉంటే తనకి మరింత ధైర్యంగా ఉంటుందని కచ్చితంగా గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేసారు. మనవడు కోరటంతో వెంటనే చంద్రబాబు హైదరాబాద్ కు వెళ్లారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన టోర్నమెంట్లో దేవాన్ష్ పక్కనే ఉండి స్వయంగా మనవడి ప్రతిభ ని వీక్షించారు.

ఈ చెస్ టోర్నమెంట్ లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ వయసుల నుండి ప్రాతినిధ్యం కలిగిన చెస్ క్రీడాకారులతో జోరుగా సాగింది. నారా దేవాన్ష్ ఈ టోర్నమెంట్‌లో పాల్గొని తన సహజ ప్రతిభను, వ్యూహాత్మక ఆలోచనలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నమెంట్‌లో దేవాన్ష్ ఫాస్టెస్ట్ టవర్ ఆఫ్ హనోయి - 7 డిస్క్, 7 - డిస్క్‌ను వేగంగా పూర్తి చేయడం, 127 మొత్తం కదలికలతో దేవాన్ష్ ఈ రికార్డ్‌ను సాధించారు.అయితే, ఈ టోర్నమెంట్ లో చంద్రబాబు తన మనవడు దేవాన్ష్ తో పాటుగా పాల్గొన్న ఇతర చిన్నారులను ప్రోత్సహించారు.

దేవాన్ష్ ఈ టోర్నమెంట్‌లో భాగస్వామి కావడం చూసి నాకు గర్వంగా ఉందంటూ ముఖ్యమంత్రి
చంద్రబాబు అభినందించారు. దేవాన్ష్ కు చెస్ పట్ల ఆసక్తి, ప్రదర్శించిన శ్రద్ధ, నైపుణ్యం తనను ఆశ్చర్య పరిచిందని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications