Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ నినాదానికి చంద్రబాబు చెక్ - మంత్రివర్గంలో ఎవరికెన్ని..!!

ఏపీలో నేడు కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. తన కేబినెట్ టీంను చంద్రబాబు ప్రకటించారు. ప్రధాని సహా ఎన్డీఏ ముఖ్య నేతలు ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. మూడు పార్టీల కూటమి నుంచి మంత్రులను ఎంపిక చేసారు. ఈ మంత్రివర్గంలో అనుభవం- యువత కలబోతగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు. జగన్ నినాదం కు చెక్ పెట్టేలా చంద్రబాబు కేబినెట్ ఖరారు చేసారు.

బీసీలకు ప్రాధాన్యత
చంద్రబాబు తన మంత్రివర్గంలో బీసీలకు, మహిళలకు ప్రాధాన్యతిచ్చారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారథి సహా 8 మంది బీసీ నేతలకు అవకాశమిచ్చారు. అలాగే టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, సీనియర్‌ నాయకురాలు గుమ్మడి సంధ్యారాణి, కొత్తగా ఎన్నికైన సవితకు కూడా మంత్రి పదవులు లభించాయి. జనసేనాని పవన్‌ కల్యాణ్‌, కందుల దుర్గేశ్‌, సవిత సహా కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో చోటు కల్పించారు. అసెంబ్లీలో 175 సీట్లు ఉండగా మంత్రివర్గంలో 25 మంది మంత్రులను తీసుకోవడానికి అవకాశం ఉంది. కేబినెట్‌ కూర్పునకు చంద్రబాబు ఓ ఫార్ములా రూపొందించారు.

Chandra Babu gives priority for BC Communities his new Cabient see deets

అనూహ్య ఎంపిక
ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి కేటాయించారు. ఆ లెక్కన 21 మంది ఎమ్మెల్యేలున్న జనసేనకు మూడు, 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి ఒకటి (సత్యకుమార్‌).. 135 స్థానాలున్న టీడీపీకి సీఎం సహా 21 మంత్రి పదవులు లభించాయి. కాపు, కమ్మ సామాజిక వర్గాలకు చెరి నాలుగు పదవులు దక్కాయి. కాపుల్లో పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, పవన్‌, దుర్గేశ్‌.. కమ్మ వర్గానికి చెందిన లోకేశ్‌, నాదెండ్ల మనోహర్‌, పయ్యావుల కేశవ్‌, గొట్టిపాటి రవికుమార్‌కు.. రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్‌ నేత ఆనం రామనారాయణరెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎం.రాంప్రసాద్‌రెడ్డికి అవకాశం లభించింది. ఎస్సీ కోటాలో అనిత, డోలా బాలవీరాంజనేయస్వామి, ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణి, ముస్లింల నుంచి మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, ఆర్య వైశ్య వర్గం తరఫున టీజీ భరత్‌ చోటు సంపాదించారు.

ఎమ్మెల్సీలకు నో ఛాన్స్
పదవులు పొందిన బీసీ నేతల్లో ఇంకా కొండపల్లి శ్రీనివాస్‌, వాసంశెట్టి సుభాష్‌, సత్యకుమార్‌, సవిత ఉన్నారు. ఉమ్మడి జిల్లాలవారీగా గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు అత్యధికంగా మూడేసి మంత్రిపదవులు దక్కాయి. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు రెండేసి లభించాయి. చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబుకు తప్ప మరెవరికీ అవకాశం లభించలేదు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలనుంచి కూడా ఒక్కొక్కరికే చాన్సు దక్కింది. అలాగే శాసనమండలి నుంచి ఎవరికీ దక్కలేదు. అయితే..పెద్ద సంఖ్యలో సీనియర్లు ఈ సారి మంత్రి పదవుల పైన ఆశలు పెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు పూర్తిగా సామాజిక కోణంలోనే కేబినెట్ కూర్పు చేసినట్లు స్పష్టం అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+