కొడాలి నాని అడ్డాలో చంద్రబాబు సభలో ఎందుకిలా..(వీడియో)
టీడీపీ అధినేత చంద్రబాబు గుడివాడ పర్యటన పై రాజకీయంగా ఉత్కంఠ కొనసాగింది. చంద్రబాబు గుడివాడలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. గుడివాడలో ప్రవేశించిన సమయం నుంచి భారీ ఎత్తున జన స్పందన కనిపించింది. కానీ, బహిరంగ సభలో మాత్రం ఫ్లాప్ షో గా వీడియోలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు సభలో ప్రసంగం కొనసాగుతున్న సమయంలో క్యాడర్ వెళ్లిపోతున్న వీడియోలు కనిపిస్తున్నాయి. ఖాళీ కుర్చీలతో సభ వెలవెల పోయింది. ఈ అంశాన్ని ఇప్పుడు ప్రధానంగా కొడాలి నానితో సహా వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు.
సుదీర్ఘ కాలం తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు గుడివాడలో పర్యటించారు. గురువారం రాత్రి రోడ్ షో తరువాత బహిరంగ సభలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్.. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కోడికత్తు కేసు అంశాన్ని ప్రస్తావించారు. జగన్ ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఇదే సమయంలో ప్రధానంగా కొడాలి నాని పై ఫైర్ అయ్యారు.

ఎన్టీఆర్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం గుడివాడని చంద్రబాబు గుర్తు చేసారు. అలాంటి చోట ఈ రోజు తులసి వనంలో గంజాయి మొక్కలా స్థానిక ఎమ్మెల్యే తయారయ్యాడని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఆ మొక్కను పెకిలించేద్దామని చెప్పారు. బూతులు మాట్లాడటం గొప్పతనమా అని ప్రశ్నించారు. అవి మాట్లాడటానికి తాను అవసరం లేదని,తమ్ముళ్లను రెచ్చగొడితే ఆ బూతులు వినలేని పిరస్థితి తీసుకొస్తారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ప్రసంగం సాగుతున్న సమయంలో సభకు హాజరైన వారు మధ్యలోనే వెళ్లిపోయారు. ఖాళీ కుర్చీలతో సభ వెలవెల బోయింది. చంద్రబాబు ప్రసంగం కొనసాగుతున్నా చాలా మంది వెళ్లిపోయారు. సభకు నిర్దేశించిన సమయం కంటే బాగా ఆలస్యం కావటంతో వారంతా వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే వైసీపీ నేతలకు అస్త్రంగా మారింది.
గుడివాడ: చంద్రబాబు సభలో కనిపించని జనం.. అవాక్కయిన తెలుగు తమ్ముళ్లు#Chandrababu #TDP #Gudivada #AndhraPradesh #ApPolitics #Oneindiatelugu pic.twitter.com/BRWYmyWspd
— oneindiatelugu (@oneindiatelugu) April 14, 2023
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గుడివాడ పర్యటనలో పెద్ద ఎత్తున జనం హాజరయ్యేలా స్థానిక నేతలు జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, చంద్రబాబు ప్రసంగం మధ్యలో వెళ్లిపోవటం..ఖాళీ కుర్చులతో ఉన్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి. దీని పైన వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పోస్టింగ్స్ చేస్తున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఖాళీ కుర్చీలు చంద్రబాబు ప్రసంగం విన్నాయంటూ ఎద్దేవా చేసారు.












Click it and Unblock the Notifications