కేసీఆర్ బాటలోనే, చంద్రబాబు - జగన్ రాజశ్యామల యాగం: మరి యోగంఎవరికి..!
రాజకీయ యోగం కోసం నేతలు యాగాలను నమ్ముకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన యాగాల కారణంగానే ఆయనకు ఊహించని విజయం దక్కందని ఇతర పార్టీల నేతల అభిప్రాయం. దీంతో..కేసీఆర్ బాటలోనే ఏపిలోని అధికా ర- ప్రతిపక్ష నేతలు నడుస్తున్నారు. ఇందు కోసం కేసీఆర్ అనుసరించిన రాజకీయ వ్యూహాలతో పాటుగా ఆధ్యాత్మిక బాట ను ఎంచుకుంటున్నారు. మరి..యాగాలను నమ్ముకుంటున్న ఈ నేతలకు యోగం వరిస్తుందా...

కేసీఆర్ తరహా యాగాలు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వామీజీలను బాగా నమ్ముతారు. ఆధ్మాత్మిక చింతన ఎక్కువ. దీంతో.. తెలంగాణ లో అధికారంలో ఉన్న సమయంలో చండీ యాగం నిర్వహించారు. ఈ యాగానికి ఏపి ముఖ్యమంత్రిని సైతం ఆహ్వానించా రు. ఈ యాగం తరువాత ఆయన గ్రేటర్ ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించారు. ఇక, తెలంగాణ ఎన్నికలకు ముందు విశాఖ స్వరూపానంద సరస్వతి సూచనల మేరకు రాజ శ్యామల యాగానికి అంగీకరించారు. విశాఖలోని రాజ శ్యామల అమ్మ వారికి కేసీఆర్ విజయాన్ని కాంక్షిస్తూ యాగం నిర్వహించారు. ఇక, తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ కు ఊహించని విజయం దక్కింది. అంతే ముఖ్యమంత్రి అయిన వెంటనే విశాఖ వెళ్లి అక్కడ శారదా పీఠంలోని రాజ శ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. తాను ఎందుకు ఆ ఆశ్రమానికి వెళ్లిందీ..ఏం చేసిందీ ముఖ్యమంత్రి కేసీ ఆర్ స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు.

కేసీఆర్ బాట లోనే..చంద్రబాబు - జగన్
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు కు గతంలో అంతగా ఆధ్యాత్మిక చింతన ఉండేది కాదు. రాష్ట్ర విభజన తరువాత ఏపి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆధ్మాత్మిక అంశాలకు..వాస్తుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వాస్తుకు అనుగుణంగానే నిర్మాణాలు చేస్తున్నారు. పూజా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. ఇక, తాజాగా కేసీఆర్ తరహాలో చంద్రబాబు కు సైతం హైదరాబాద్ కేంద్రంగా ఓ ప్రముఖ సిద్దాంతి రాజ శ్యామల యాగం నిర్వహించినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇదొక్కటే కాకుండా తారా వశీకరణం లాంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో రాజ్యాధికా రమే లక్ష్యంగా వేడుకుంటూ ఈ పూజలు జరిగాయి. ఇక, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వైసిపి అధినేత జగన్ సైతం ఈ మధ్య కాలంలో దైవ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. స్వరూపానంద సరస్వతి సూచనల మేరకు రుషికేష లో యాగాలు నిర్వహించారు. ఇక, ఈ మధ్య కాలంలో స్వరూపానంద సరస్వతితో జగన్ సాన్నిహిత్యం పెరి గింది. ఇప్పటికే హైదరాబాద్ లో ఒక సిద్దాంతి తో యాగం చేయించిన జగన్..తాజాగా తిరుమల లో స్వరూపానంద స్వామి తో జరిగిన సంభాషణ లో రాజ శ్యామల యాగం గురించి ప్రస్తావనకు వచ్చి..నిర్వహించాలని నిర్ణయించారు.

యాగాలు ఓకే..మరి యోగం ఎవరికి..
కేసీఆర్ చేసిన యాగాలు చేసి..స్వామీజలు చెప్పినట్లు వింటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..విపక్ష నేత జగన్ లు యాగాలు చేయిస్తున్నారు. రాజ శ్యామల యాగం లాంటివి చేయటం ద్వారా రాజకీయ ప్రత్యర్ధుల పై విజయం సాధిస్తా రని పండితులు చెబుతున్నారు. మరి ఇద్దరూ ఈ రాజ శ్యామల యాగం చేసారు. కానీ, ఎవరో ఒకరే గెలవాలి. ఈ యాగం తో యోగం ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది. చంద్రబాబు - జగన్ ఇద్దరి లక్ష్యం ముఖ్యమంత్రి పీఠమే. మరి, ఇద్దరూ ఈ తరహా యాగం చేస్తే..ఇద్దరూ గెలిచే పరిస్థితి ఉండదు. ఒకరు ఖచ్చితంగా ఓడిపోవాలి. మరి..ఈ వీరిద్దరిలో గెలిచేదెవరు..ఓడేదెవరు. ఇది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే..
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications