చంద్రబాబు నిర్ణయం వెనుక - ఇదీ అసలు లెక్క..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి - పోలవరం కేంద్రంగా ముఖ్యమంత్రి వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందు లో భాగంగా అమరావతికి నిధుల సమీకరణ పైన తొలుత ఫోకస్ చేసారు. ప్రపంచ బ్యాంకుతో పాటుగా హడ్కో రుణం మంజూరైంది. తొలి విడత నిధులు అందాయి. పనుల రీ లాంఛ్ కోసం ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నారు. ఇదే సమయంలో అమరావతి కేంద్రంగా చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.

అమరావతి వేదికగా
ఏపీ రాజధాని అమరావతి వేదికగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతింటి నిర్మాణానికి నిర్ణయించారు. ఇందు కోసం శంకుస్థాపన తేదీ ఖరారు చేసారు. రేపు (బుధవారం) ఏప్రిల్ తొమ్మిదిన శంకుస్థాపన జరగనుంది. ఇప్పటికే సొంతింటి నిర్మాణం కోసం అమరావతిలోని వెలగపూడి గ్రామ పరిధిలో ఇంటి కోసం 5 ఎకరాలను ముఖ్య మంత్రి కుటుంబం కొనుగోలు చేసింది. ఆ స్థలాన్ని చదును చేసే పనులు పూర్తి చేస్తున్నారు. వెంటనే ఇంటి నిర్మా న్ని ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్థలాన్ని పరిశీలించిన వాస్తు సిద్ధాం తి కొన్ని కీలక సూచనలు చేసారు. గవర్నమెంట్ కాంప్లెక్స్ కి రెండు కిలోమీటర్ల దూరంలోనే చంద్రబాబు నివాసం నిర్మిస్తున్నారు.

chandra-babu-latest-decision-amid-pm-tour-in-amaravati

తాజా నిర్ణయంతో
సీఎం చంద్రబాబు కృష్ణా ది ఒడ్డున ఉండవల్లిలో లింగమనేనికి చెందిన అతిథి గృహంలో గత పదేళ్లుగా ఉంటున్నారు. తాజాగా అమరావతిలో సువిశాల స్థలాన్ని కొనుగోలు చేశారు. భవిష్యత్తు కుటుంబ అవసరాలు, తన హోదా, వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ స్థలం వైపు మొగ్గు చూపారు. రోడ్డుకు ఆనుకుని ఉన్న 25 వేల చదరపు గజాల ప్లాట్ అనుకూలంగా ఉంటుందని నిర్ణయానికి వచ్చారు. ఇది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరున ఉన్న రిటర్నబుల్ ప్లాట్. ఇప్పటికే రైతులకు డబ్బు చెల్లించినట్లు తెలిసింది. దీనికి నాలుగు వైపులా రోడ్డు ఉండడం ప్రధానంగా రాజధానిలో కీలకమైన సీడ్ యాక్సెస్ దీని పక్క నుంచి వెళ్తుండడంతో ఈ స్థలాన్ని ఎంపిక చేశారు.

Take a Poll

రేపే ముహూర్తం
నిర్మాణ పనులు చంద్రబాబు స్థలం సమీపంలో ఎన్జీవో నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు, విట్ విశ్వవిద్యాలయం, తాత్కాలిక హైకోర్టు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో పాటు రవాణా పరంగానూ అనుకూలతులు ఉన్నట్లు భావించి కొనుగోలు చేశారు. ఇంటి నిర్మాణం, పునాది పటిష్టం తదితర అంశాలకు సంబంధించి ఇప్పటికే పలుచోట్ల మట్టి పరీక్షలు కూడా జరిపారు. దాదాపు 5 ఎకరాల్లో ఉన్న ప్లాట్​లో కొంత విస్తీర్ణంలోనే ఇంటిని నిర్మించేలా ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన విస్తీర్ణంలో ఉద్యానవనం, రక్షణ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్, తదితర అవసరాల కోసం వినియోగించనున్నారు. రాజధాని పనుల ప్రారంభం వేళ ముఖ్యమంత్రి ఇంటి నిర్మాణం ద్వారా.. ఎవరికీ విమర్శలకు అవకాశం లేకుండా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+