నామినేటెడ్ పదవులు వారికే - చంద్రబాబు తాజా నిర్ణయం..!!
ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ ఎప్పుడు. ఈ నిర్ణయం కోసం కూటమిలోని మూడు పార్టీల ఆశావాహులు నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే నామినేటెడ్ పదవుల పైన కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్న సమయంలో మార్పు చోటు చేసుకుంది. పదవుల ప్రకటన విషయంలో చంద్రబాబు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవులు ఎవరికి ఖరారు చేయాలనే అంశం పైన ఒక స్పష్టతతో ఎంపిక చేస్తున్నారు.
కసరత్తు
ఏపీలో మూడు పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మూడు పార్టీలు ఒక పార్ములా ప్రకారం పదవుల ను ఖరారు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి పదవులతో తొలి జాబితాను సిద్దం చేసారు. ఈ వారంలో ప్రకటిస్తారని పార్టీ నేతలు ఆశించారు. కానీ, చంద్రబాబు తాజాగా నామినేటెడ్ పదవుల విషయం లో కీలక సూచనలు చేసారు.

ప్రాధాన్యాత
నామినేటెడ్ పదవులను సెప్టెంబర్ లో భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. పదవుల విషయంలో మిత్రపక్షాల నుంచి వస్తున్న ప్రతిపాదనలతో పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తరువాతనే పదవులను ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే రూపొందించిన జాబితాల పైన మరోసారి కొత్తగా వచ్చిన అభ్యర్దనలతో కలిపి కసరత్తు చేయాలని నిర్ణయించారు. అర్హులకు నష్టం జరగకుండా చూడాలని పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. దీంతో, దరఖాస్తుల పైన మరోసారి వడపోత ప్రారంభించారు.
వీరికే ఛాన్స్
తొలి దశలో రెండు విభాగాలకు చెందిన నేతలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చిన చోట్ల...త్యాగం చేసిన నేతలకు తొలి ప్రాధాన్యత దక్కనుంది, అలేగా బీసీ వర్గాలకు చెందిన కార్పోరేషన్లు, ఫెడరేషన్ల పాలన మండళ్ల నియామకాల్లోనూ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వీటిలో కొన్ని పదవులు జనసేన,బీజేపీ నేతలకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీంతో, వచ్చే నెల రెండో వారంలో నామినేటెడ్ పదవులను ప్రకటించేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications