జగన్ కోసం ఎన్ఐఏ నా, మోదీ జీ..ఏంటీ వైఖరి : ప‌్రధాని కి చంద్రబాబు నిరసన..!
వైసిపి అధినేత జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ కు అప్పగించటాన్ని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు బట్టారు. ఇక వ్యక్తి పై జరిగిన దాడిని ఎన్ఐఏ కు ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇది సమాఖ్య స్పూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తు న్నారని దుయ్యబట్టారు. ఎన్ఐఏ దర్యాప్తు సరి కాదని పేర్కొన్నారు.
మోదీకి 5 పేజీల లేఖ..
ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాశారు. వైకాపా అధినేత జగన్‌పై దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించార ని చంద్రబాబు లేఖలో మండిపడ్డారు. జగన్‌పై దాడి కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు సరికాదని పేర్కొన్నారు. కేంద్రం వ్యవహ రించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చంద్రబాబు 5 పేజీల లేఖ రాశారు. ఇదే లేఖలో 2008లో ఎన్‌ఐఏ చట్టాన్ని మోదీ వ్యతిరేకించారని చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడదే చట్టాన్ని అనుసరిస్తూ జగన్‌పై దాడి కేసును ఆ సంస్థకు అప్పగించారన్నారు. ఎన్‌ఐఏ చట్టంపై మోదీ ద్వంద్వ విధానం అవలంభిస్తున్నారని విమర్శించారు. విదేశీ శక్తుల ప్రమేయం ఉండే కేసులను మాత్రమే జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని పేర్కొన్నారు. వ్యక్తిగత దాడి కేసును కూడా ఎన్‌ఐఏకు అప్పగించడం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు.

ఎందుకీ ఆందోళన..
జగన్ పై దాడి జరిగిన తరువాత ఇది రాష్ట్ర పరిధిలోని శాంతి భద్రతల పరిధిలోకి రాదని నాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ తరువాత వైసిపి నేతలు ఈ కేసును మూడో సంస్థకు అప్పగించాలంటూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు సూచనల మేరకు కేంద్రం దీనిని ఎన్ఐఏ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వం దీని పై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోము ల హత్య కేసును ఎన్.ఐ. ఎకి చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. ఇప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం జగన్ కేసును ఎన్ఐఏ కు అప్పగించటాన్ని తప్పు బట్టటం చూస్తుంటే వారికి ఎందుకింత ఆందోళనో అర్దం కావటం లేదని బిజెపి..వైసిపి నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications