సంచలన ఆరోపేణ చేసిన చంద్రబాబు. ఓట్లు టీడీపీకి వేస్తే వైసీపీకి వెళ్తున్నాయి
Recommended Video

టిడిపి అధినేత పోలింగ్ నిర్వహణ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30 శాతం ఇవియం లు పని చేయక పోవటం వలన దాదాపు మూడు గంటల సమయం వృధా అయిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇవిఎంలు పని చేయని చోట రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసారు. టిడిపికి ఓట్లు వేస్తుంటే వైసిపికి వెళ్తున్నాయని ఆరోపించారు.
టిడిపికి ఓట్లు వేస్తుంటే వైసిపికి వెళ్తున్నాయి..
టిడిపి అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీకి లేఖ రాసారు. ఎన్నికల నిర్వహణ తీరు పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవియంల విధానాన్ని తాము తొలి నుండి వ్యతిరేకిస్తున్నామని.. ఇప్పుడు నిర్వహణలో వైఫల్యం కారణంగా మూడు గంటల విలువైన సమయం కోల్పోయామని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఇవియంల పై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని..దీని కారణంగానే తాము ఇవియంలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని గుర్తు చేసారు. ఎక్క డైతే ఇవియంలు మొరాయించాయో అక్కడ రీ పోలింగ్ నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. అదే విధంగా పలు ప్రాంతాల్లో టిడిపికి ఓట్లు వేస్తుంటే వైసిపికి పడుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని..వీటిని సరి చేయకుంటే తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

సరైన నిర్ణయం తీసుకోకుంటే ఆందోళన..
ఎన్నికలను సక్రమంగా నిర్వహించాల్సిన సమయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని టిడిపి అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. ఎన్నికల సంఘం వెంటనే ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. చంద్రబాబు ఎన్నికల ప్రధానాధికారికి రాసిన లేఖను టిడిపి నేతలు ఆశోక్‌బాబు, వర్ల రామయ్యలు ద్వివేదీకి అందచేసారు. వారితోనూ ద్వివేదీ ఏపి వ్యాప్తంగా మొత్తం 45900 ఇవియంలు పోలింగ్ కోసం వినియోగిస్తున్నాయని..అందులో 362 ఇవియంల తోనే సమస్యలు వచ్చాయని..వాటిలో ఇప్పటికే 310 ఇవియం ల్లోని సమస్యలను పరి ష్కరించామని వివరించారు. సాయంత్రం 6 గంటలలోగా పోలింగ్ బూత్‌కు చేరుకొనే వారికి ఎంత ఆలస్యమైనా వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications