గోదావరి తీరాన చంద్రబాబు కీలక నిర్ణయాలు - ఇక సమరమే..!!

తెలుగుదేశం పండుగకు సర్వం సిద్దమైంది. మూడు రోజుల పాటు జరిగే మహానాడు ఈ సారి ప్రత్యేకంగా నిలవనుంది. ఎన్నికల ముందు జరుగుతున్న ఈ మహానాడు ద్వారా పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల సమర శంఖం పూరించనున్నారు. మేనిఫెస్టోతో పాటుగా పొత్తులపైన క్లారిటీ ఇవ్వనున్నారు. పార్టీలో చేరికలు ఉంటాయని తెలుస్తోంది. 15 లక్షల మందితో సభ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మూడు రోజుల పాటు చంద్రబాబు బస్సులోనే బస చేయనున్నారు.

టీడీపీ మహానాడుకు సిద్దం: ఏపీలో అధికారం దక్కాలంటే గోదావరి జిల్లాలు కీలకం. ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ టీడీపీ మహానాడుకు గోదావరి తీరం రాజమహేంద్ర వరం వేదిక కానుంది. ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. 27న పార్టీ ప్రతినిధుల సభ..28న మహానాడు బహిరంగ సభను ఈ సారి పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఎన్నికల ముందు బలం చాటుకొనేలా బహిరంగ సభకు రెండు రాష్ట్రాల నుంచి 15 లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. మహానాడుతో పాటుగా ఎన్టీఆర్ శతజయంతి కావటంలో ఈ నెల28వ తేదీ పార్టీ శ్రేణులకు..ఎన్టీఆర్ అభిమానులకు పండుగ గా మారనుంది. మహానాడుకు హాజరవ్వాలంటూ చంద్రబాబు సంతకాలతో ఆహ్వాన పత్రాలు పంపారు.

 Chandra Babu

చంద్రబాబు ప్రసంగం..ప్రకటనలు: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనేది పార్టీ అధినేత చంద్రబాబు లక్ష్యం. ఇందుకోసం ఈ మహానాడు ద్వారా ఎన్నికలకు పార్టీని సంసిద్దత చేసేలా నిర్ణయాలు..ప్రసంగాలు ఉండనున్నాయి. ప్రధానంగా రానున్న ఎన్నికల మేనిఫెస్టో పైన స్పష్టమైన సంకేతాలు ఇవ్వనున్నారు. తాను అందిస్తున్న సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని సీఎం జగన్ ధీమాగా ఉన్నారు. దీంతో జగన్ సంక్షేమానికి కౌంటర్ గా చంద్రబాబు ఏం చేయబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్న అంశం. జనసేనతో టీడీపీ పొత్తు దాదాపు ఖాయమైంది. బీజేపీ కలుస్తుందా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ మహానాడు వేదికగా ఆమోదించే రాజకీయ తీర్మానాల్లో పొత్తులపైన కూడా ఉంటుందని తెలుస్తోంది. పొత్తులు..సీట్ల కేటాయింపు..వర్గాల వారీగా ప్రాధాన్యత పైన చంద్రబాబు బహిరంగ సభలో స్పష్టత ఇవ్వనున్నారు. వచ్చే దసరా నాడు పొత్తులకు అనుగుణంగా ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన ఉండనుంది.

 Chandra Babu

బస్సులోనే చంద్రబాబు..లోకేష్ మకాం: పార్టీ అధినేత చంద్రబాబు మహానాడు కోసం ఈ మధ్నాహ్నం రాజమహేంద్ర వరం చేరకోనున్నారు. పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన లోకేష్ ఈ సాయంత్రం మహానాడు ప్రాంగణానికి చేరుకుంటారు. మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బస్సుల్లోనూ ఇద్దరూ బస చేయనున్నారు. ఈ సాయంత్రం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. మహానాడులో ప్రవేశ పెట్టే తీర్మానాలను చర్చించి ఆమోదించనున్నారు. మొత్తం 20 తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నారు. అందులో ఏపీకి సంబంధించి 14, తెలంగాణకు సంబంధించి ఆరు ఉండనున్నాయి. రేపు (శనివారం) పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రకటించనున్నారు. ఎన్నికల వేళ టీడీపీ మహానాడు నిర్వహణ..నిర్ణయాలు రాజకీయంగా కీలకం కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+