లోకేష్ పై చంద్రబాబు గెలుపు..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్ధులతో మమేకం అయ్యారు. పేరెంట్స్ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్దులకు అందుతున్న బోధన.. సదుపాయాల పైన ఆరా తీసారు. మధ్నా హ్న భోజన పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు. వారికి ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. ఇదే సమయంలో విద్యార్ధులతో కాసేపు టగ్ ఆఫ్ వార్ ఆడించిన చంద్రబాబు అక్కడ లోకేష్ టీం ను ఓడించారు.

బాపట్లలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమంలో చంద్రబాబు విద్యార్ధుల సమర్థతను పరీక్షించారు. బోధన పద్దతుల పైన ఆరా తీసారు. వారితో ముఖాముఖి సంభాషించిన ముఖ్యమంత్రి పిల్లల జీవిత లక్ష్యాలను తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. తరువాత విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వవిద్యార్థుల సూచనలు, సలహాలు ఆయన విన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణాన్ని సీఎం పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

Chandra Babu made key suggestions in Parents - teachers meeting at Bapatla

విద్యార్ధులు స్మార్ట్ ఫోన్లకు ఎక్కువగా బానిసలు అవుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. వారిని అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ పైనే ఉందని చెప్పారు. ఎలక్ట్రానిక్ డివైసెస్‌తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.సైబర్ నేరగాళ్లు చాలా మంది తయారయ్యారని వారి చర్యలకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. మాయమాటలతో స్నేహం పేరుతో జీవితాలు నాశనం చేసే స్థాయికు వారు వచ్చారన్నారు. టెక్నాలజీతో మంచితో పాటు చెడు ఉంటుందని గుర్తుంచుకో వాలని అన్నారు. డ్రగ్స్‌ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని చంద్రబాబు అన్నారు.

ఒకసారి డ్రగ్స్ వ్యసనంలో పడితే తిరిగి మామూలు మనిషి కావడం కష్టమన్నారు. ఆ వ్యసనం సర్వనాశనం చేస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. మెగా పేరంట్ టీచర్ ప్రోగ్రాంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. చంద్రబాబు - లోకేష్ రెండు జట్లుగా ఇండోర్ స్టేడియంలో సరదాగా టగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడారు. చంద్రబాబు వైపు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అధికారులు ఉండగా.. లోకేశ్ వైపు ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఇతర అధికారులు ఉన్నారు. ఇందులో లోకేశ్ పై సీఎం చంద్రబాబు జట్టు గెలుపొందింది. అటు కడప లో జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు పవన్ హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+