వైసీపీ కంచుకోటల్లో చంద్రబాబు సైలెంట్ ఆపరేషన్..!!
వచ్చే ఎన్నికల్లో అధికారం దిశగా టీడీపీ కొత్త రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇందు కోసం సైలెంట్ ఆపరేషన్ మొదలు పెట్టారు.
ఏపీలో ఎన్నికల వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ముందుగా ప్రత్యర్ది బలాల పైన ఫోకస్ పెట్టారు. ముందుగా వైసీపీ కంచు కోటలను టార్గెట్ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ కు బలమైన మద్దతుగా నిలిచిన జిల్లాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో..ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం ముందుగా అక్కడే వైసీపీని దెబ్బ తీసేందుకు కొత్త రాజకీయం ప్రారంభించారు. అందులో భాగంగా రెండు జిల్లాల్లో ప్రభావం కనిపిస్తోంది. అయితే..వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ ఇదే తరహాలో చేసిన స్కెచ్ కలిసి రాలేదు. మరి..ఇప్పుడు కలిసి వస్తుందా. అధికారానికి దగ్గర చేస్తుందా. అసలు ఏం జరుగుతోంది.

టార్గెట్ వైసీపీ..టీడీపీ ఆపరేషన్
వచ్చే ఎన్నికల్లో అధికారం దిశగా టీడీపీ కొత్త రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇందు కోసం సైలెంట్ గా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ముందుగా వైసీపీ గత ఎన్నికల్లో టీడీపీకి అవకాశం లేకుండా చేసిన జిల్లాలు..ఇప్పటికీ బలంగా ఉన్న నియోజకవర్గాల పైన టీడీపీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో ఆపరేషన్ సగం అయ్యే వరకు వ్యవహారం బయటకు రాలేదు. ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి టికెట్లు ఖరారు చేసుకున్నారు. అధికార పార్టీ పైన ఆరోపణలు గుప్పించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే తమ ప్రభుత్వం పైన ఆరోపణలు చేయటం ద్వారా ప్రజల్లో ప్రభుత్వం పైన వచ్చే వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. అదే సమయంలో మిగిలిన ఎమ్మెల్యేల్లోనూ డైలమా వాతావరణం తీసుకొచ్చే అవకాశం ఉంటుందని అంచనాకు వచ్చారు. ప్రజల్లోనూ ఆలోచనకు కారణమవుతోంది. ఆ సైలెంట్ ఆపరేషన్ లో భాగంగానే..వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఒకరు టీడీపీ నుంచే పోటీ చేస్తామని చెబుతున్నా..టీడీపీ ముఖ్య నేతలు మాత్రం స్పందించటం లేదు.

వైసీపీ కంచుకోటల్లో కొత్త ఎత్తుగడలు
వైసీపీ 2019 ఎన్నికల్లో వైసీపీ కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పడు టీడీపీ మిగిలిన జిల్లాల కంటే ఈ జిల్లాల్లో ఆపరేషన్ కొనసాగిస్తోంది. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ఓపెన్ అయిపోయారు. కర్నూలు జిల్లాలో గతంలో టీడీపీలో పని చేసి వైసీపీకి వెళ్లిన మాజీ నేత బిజ్జం పార్ధసారధి రెడ్డి ని తిరిగి టీడీపీలోకి రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఆయన కూడా అందుకు సిద్దం అయిపోయారు. కడప జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీలో చేరిన డీఎల్ రవీంద్రారెడ్డి ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు మినహా ఎవరూ సరిదిద్దలేరంటూ చెప్పుకొస్తున్నారు. మరి కొందరు జిల్లాకు చెందిన సీనియర్లను పార్టీలోకి తీసుకొనేందుకు రంగం సిద్దమైంది. అటు జనసేనతో పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తున్న వేళ.. విశాఖ- విజయనగరం- శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నమ్ముకున్న సామాజిక సమీకరణా ల కు ధీటుగా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది.












Click it and Unblock the Notifications