నామినేటెడ్ పదవులు ఖరారు- చంద్రబాబు,పవన్ జాబితాలో..!!

ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఇప్పుడు నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియపైన కసరత్తు చేస్తోంది. మూడు పార్టీలకు పదవుల అంశం పైన చర్చలు మొదలయ్యాయి. ప్రభుత్వంలో ముందుగా రాష్ట్ర స్థాయి పదవులు భర్తీ చేయాలని నిర్ణయించారు. పవన్ కల్యాణ్ తమ పార్టీ నుంచి కోరుకుంటున్న పదవుల పైన ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎవరికి ఏ పదవి దక్కుతుందనేది ఆసక్తిగా మారుతోంది.

పదవులపై చర్చ
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్‌ పోస్టుల పంపకాలపై టిడిపి కూటమిలో చర్చలు మొదలయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలను అందించాలని సాధారణ పరిపాలనశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. వీటితోపాటు సొసైటీ, ప్రత్యేక బాడీల్లో ఉన్న పోస్టుల వివరాలు కోరారు. కూటమిలోని పార్టీలు ఏ పార్టీకి ఎన్ని పోస్టులు ఇవ్వాలి, ఏ పోస్టులు ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై కసరత్తు జరుగుతోంది. వివిధ శాఖల్లో సుమారు 95 కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. వీటిల్లో 25 ఛైర్మన్‌ పోస్టులు జనసేన కోరినట్లు తెలిసింది.

Chandra Babu - Pawan to finalise Nominated posts for thee parties leaders soon

ఏ పార్టీకి ఎన్ని
అయితే జనసేనకు, బిజెపికి ఎన్ని కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది. 2014-19 టిడిపి అధికారంలో ఉన్న సమయంలో బిజెపికి, జనసేనకు ఎలాంటి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులు ఇవ్వలేదు. జనసేన కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఈ ప్రస్తావన కూడా రాలేదు. ఇప్పుడు కూటమిలో ఎవరికి ఏం కేటాయిస్తారనేది వేచిచూడాల్సి ఉంది. టిడిపిలో నామినేటెడ్‌ పోస్టులు కోరుతున్న వారిలో ఆశావహులు భారీగానే ఉన్నారు. మూడేళ్ల వరకు ఎమ్మెల్సీ పోస్టులు కూడా ఖాళీ అయ్యే అవకాశం లేదు. కేవలం ఐదు ఖాళీలు మాత్రమే వచ్చే ఏడాది రానున్నాయి.

కూటమి కసరత్తు
మాజీ మంత్రులు, సీనియర్‌ నాయకులు కూడా నామినేటెడ్‌ పోస్టులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టిడిపి కార్యాలయంలో ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీకి ఎవరు ఎలా పనిచేశారన్న అంశం ప్రాతిపదికగా అంతర్గతంగా ర్యాంకులు ఇవ్వాలని యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా పదవుల్లో అవకాశం ఇవ్వాలని చూస్తోంది. ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తులను తొలుత టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ స్క్రూటినీ చేస్తారని చెబుతున్నారు. ఆ తరువాత చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+