చంద్రబాబు ధర్నా..ఐటి దాడులకు నిరసనగా : మోదీ ఖబడ్దార్ : కోడ్ వేళ..ధర్నా ఎలా...!
Recommended Video

ఎన్నికల వేళ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్డెక్కారు. కేంద్రం తీరును నిరసిస్తూ ధర్నా చేసారు. అంబేద్కర్ విగ్ర హం ముందు ధర్నా చేసి మోదీ వైఖరిని ఎండగట్టారు. మోదీ తన తీరు మార్చుకో కుంటే తగిన మూల్యం తప్పదని హె చ్చరించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి..ఏపి ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దంటూ హెచ్చరించారు.

చంద్రబాబు నిరసన..ధర్నా..
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం ఏపి పై కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేసారు. ఏపి ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ప్రధాని మోదీ పై మండి పడ్డారు. టిడిపి నేతలే లక్ష్యంగా కేంద్ర సంస్థలు దాడులు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు నిరసనలు నిర్వహించాయి. నిరసనలో పాల్గొన్న చంద్రబాబు మోదీ ఏపి కి నిధులు ఇవ్వకుండా..ఎదురు దాడి చేస్తూ తెలుగు ప్రజల పై యుద్దం ప్రకటించారని ఆరోపించారు. బిజెపి అగ్ర నేత అద్వానీ చెప్పిన దానికి మోదీ పూర్తి వ్యతిరేకమని చంద్రబాబు విమర్శించారు. దేశాన్ని నాశనం చేయాలని మోదీ కంకణం కట్టుకున్నారంటూ తీవ్ర స్థాయి ఫైర్ అయ్యారు.

మోదీకి..జగన్ సహకారం..
ఏపికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ చేస్తున్న కుట్రలకు వైసిపి అధినేత జగన్ సహకారం అందిస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. రెండు రోజుల క్రితం జగన్ ప్రధానిని పొగుడుతూ..మరో సారి మోదీయే ప్రధాని అవుతారని చెప్పుకొచ్చార ని గుర్తు చేసారు. ఒక పథకం ప్రకారం జగన్ లోటస్ పాండ్‌లో ఉండి కుట్రలు, కుతంత్రాలకు ప్లాన్ చేస్తున్నారని దు య్య బట్టారు. మోదీకి పతనం ప్రారంభమైందని, అందుకే ఇలాంటి దురుద్దేశాలకు పాల్పడుతున్నారన్నారు. రాక్షస పాలనకు మోదీ శ్రీకారం చుట్టారని, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని, ప్రశ్నిస్తున్నవారిపై ఐటీ దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీని చరిత్ర హీనుడిగా నిలబెడతామని చంద్రబాబు హెచ్చరించారు. మోదీ లాంటి దుర్మార్గుడికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. ఖబడ్దార్..ఏకపక్షంగా దాడులు చేస్తే ఊరుకునేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.

కోడ్ వేళ..ధర్నా ఏలా..
ప్రధాని మోదీ తీరుకు నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో పార్టీ నేతలతో కలిసి నిరసనలకు దిగటం ఇప్పుడు చర్చ నీయాంశంగా మారింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ధర్నాలు..నిరసలకు అనుమతి ఉం డదని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ముందుగానే అనుమతులు తీసుకున్నారా..లేదా అనేది ఇప్పు డు వైసిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. సమావేశాలు..ర్యాలీలు నిర్వహించాలంటే ముందుగా ఎన్నికల అధికారుల నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. అయితే, ఏకంగా ముఖ్యమంత్రి ఇప్పుడు ధర్నాకు దిగటం తో అధికారుల అనుమతుల పై వైసిపి ఆరా తీస్తోంది. ఒక వైపు కోడ్ అమల్లో ఉండగానే..రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు ఎ రకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తాయనేది వారి అనుమానం. దీని పై ఇప్పుడు వైసిపి లో చర్చ సాగుతోంది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications