చంద్రబాబు ఫోన్ ఎత్తని పవన్- అలక వెనుక..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ రోజుతో ఎనిమిది నెలలు పూర్తి చేసుకుంది. ఈ సమయంలో ఆసక్తి కర అంశాలు తెర మీదకు వస్తున్నాయి. కొద్ది రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ అస్వస్థతతో ఉన్నారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. పవన్ మాత్రం అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు పవన్ స్పందించకపోవటం కూటమిలో సంచలనంగా మారుతోంది. పవన్ ఈ రోజు దక్షిణాది రాష్ట్రాల యాత్రలో భాగంగా కొచ్చి చేరుకున్నారు. అసలు కూటమిలో ఏం జరుగుతోంది.

పవన్ కు ఏమైంది
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జ్వరం, వెన్ను నొప్పితో బాధ పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం పవన్ కార్యాలయ అధికారులు ఈ విషయం వెల్లడించారు. అస్వస్థత కారణంగానే మంత్రివర్గ భేటీకి హాజరు కాలేదు. తాజాగా చంద్రబాబు కేబినెట్ మంత్రులు, శాఖల కార్యదర్శులతో ప్రత్యే కంగా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి పవన్ హాజరు కాలేదు. ఈ సమయంలో మంత్రి మనోహర్ జోక్యం చేసుకొని పవన్ వెన్నునొప్పితో బాధ పడుతున్నారని.. అందుకే హాజరు కాలేదని తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. పవన్ తో మాట్లాడేందుకు ప్రయత్నించానని చెప్పారు.

Chandra Babu reach out Pawan over phone no response Reasons here

చంద్రబాబు ప్రయత్నించినా
దీనికి కొనసాగింపుగా తాను పవన్ కోసం ప్రయత్నించానని.. దొరకలేదని, ఇప్పుడెలా ఉన్నారని అడిగారు. దీనికి స్పందించిన మనోహర్ పేర్కొన్నారు. ఈ రోజు నుంచి పవన్ దక్షిణాదిన ప్రముఖ ఆలయాల సందర్శన కోసం కొచ్చి కు చేరుకున్నారు. తాను స్వయంగా ప్రయత్నించినా పవన్ అందుబాటులోకి పవన్ రాలేదని చంద్రబాబు సమావేశంలో ఓపెన్ గా చెప్పటం ఇప్పుడు కూటమి లో ఆసక్తి కర చర్చగా మారింది. పవన్ స్పందించకపోవటం వెనుక కారణాల పైన కీలక అంశాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రుల ర్యాగింగ్స్ ను చంద్రబాబు వెల్లడించారు. పవన్ లేని సమావేశంలో ర్యాంకుల ప్రకటన పైన జనసేన తో పాటుగా రాజకీయంగానూ చర్చ జరిగింది.

అసలు కారణం
ఇప్పుడు.. పవన్ శాఖలోనే ఫైళ్ల పెండింగ్ అంశం తాజా కార్యదర్శుల సమావేవంలో లెక్కలతో సహా అధికారులు వెల్లడించారు. జనవరి నెలఖారు వరకు పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పెండింగ్ ఉన్న పైళ్ల వివరాలను ప్రస్తావించారు. చంద్రబాబు ఇప్ప టికే పలు మార్లు తాను మంత్రులకు ఇచ్చిన ర్యాంకుల వెనుక కారణాలను వివరించారు. ఒకరిని తక్కువ చేయటానికో.. మరెవరినో ఎక్కువ చేయటానికో ర్యాంకులు ఇవ్వలేదని స్పష్టం చేసారు. తాజా కార్యదర్శల భేటీలోనూ మరోసారి ఇదే అంశం పైన క్లారిటీ ఇచ్చారు. అయితే, పవన్ ఈ అంశం తో పాటుగా రాజకీయంగా కొద్ది నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాల పైన ఆగ్రహం తో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాను ప్రయత్నించినా పవన్ అందుబాటులోకి రాలేదని నేరుగా చంద్రబాబు చెప్పటం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+