షర్మిలకు చంద్రబాబు మార్క్ షాక్ - బీజేపీతో రివర్స్ గేమ్, ఆట షురూ..!!

ఏపీలో పొత్తు రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. జగన్ సింగిల్ గానే పోటీ చేస్తానని అభ్యర్దులను ఎంపిక చేస్తున్నారు. జగన్ ఓటమి లక్ష్యంగా కలిసిన టీడీపీ, జనసేన కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నాయి. తమతో బీజేపీ కలిసి వస్తుందని ఇప్పటి వరకు రెండు పార్టీలు అంచనా వేసాయి. ఇప్పుడు చంద్రబాబు రివర్స్ గేమ్ ప్రారంభించారు. అదే సమయంలో కాంగ్రెస్ పగ్గాలు స్వీకరిస్తున్న షర్మిలకు చంద్రబాబు మార్క్ షాక్ ఇచ్చేందుకు రంగం సిద్దమైంది.

చంద్రబాబు కొత్త వ్యూహాలు
ఏపీలో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది చంద్రబాబు లక్ష్యం. ఇప్పటికే పవన్ తో జత కట్టారు. బీజేపీతో పొత్తు పైన సంకేతాలు పంపారు. కానీ, ఇప్పటి వరకు బీజేపీ నుంచి సానుకూల స్పందన రాలేదు. ఇదే అంశం పైన తాజాగా చంద్రబాబు - పవన్ మధ్య కీలక నిర్ణయం జరిగినట్లు సమాచారం. ఈ నెల 22న అయోధ్య రామ మందిరం ప్రారంభం కార్యక్రమంలో బీజేపీ నాయకత్వం బిజీగా ఉంది. ప్రధాని మోదీ దీక్షలో ఉన్నారు. ఈ నెలాఖరు డెడ్ లైన్ గా చూడాలని..అప్పటి వరకు బీజేపీ కోసం వేచి చూడాలని నిర్ణయించారు. బీజేపీ నుంచి సానుకూల స్పందన రాకుంటే ఏ విధంగా ముందుకు వెళ్లాలి.. షర్మిల ప్రభావం ఏంటనే అంశం పైన ఇద్దరు నేతలు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

Chandra Babu Ready to join Hands with Communists if BJP not Accepts the Alliance for next Elections

బీజేపీ వచ్చినా..రాకున్నా
బీజేపీతో పొత్తు పైన టీడీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీతో పొత్తుతో కొన్ని వర్గాల ఓట్లు దూరం అవుతాయని అభిప్రాయపడుతున్నాయి. అయితే, ఎన్నికల సమయంలో జగన్ ను ఎదుర్కోవాలంటే బీజేపీ మద్దతు అవసరమనేది మరి కొందరి అభిప్రాయం. పవన్ మాత్రం బీజేపీతో కలిసి వెళ్లాలని కోరుతున్నారు. దీంతో..మరి కొద్ది రోజులు వేచి చూసి ఆ తరువాత నిర్ణయం తీసుకోవాలని ఒక అంగీకారానికి వచ్చారు. ఇక, బీజేపీతో పొత్తు లేదని ఖరారైతే వామపక్షాలతో పొత్తుతో వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. జాతీయ రాజకీయాల్లో భాగంగా ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో పాటుగా వామపక్షాలు కలిసి ఉన్నాయి. ఏపీలోనూ కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పని చేస్తాయని పార్టీ ఢిల్లీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ, ఏపీలో వారిని తమ వైపు తిప్పుకొనేందుకు చంద్రబాబు కొత్త వ్యూహాలతో సిద్దం అవుతున్నారు.

వామపక్షాలతో కూటమి
దీని ద్వారా ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన వెంటనే షర్మిలకు తొలి షాక్ ఇవ్వటానికి చంద్రబాబు సిద్దమయ్యారు. ఏపీలో సీపీఐ నేతలు సైతం టీడీపీ అటు బీజేపీతో పొత్తు లేకుంటే కలవటానికి తాము సిద్దమనే సంకేతాలు ఇస్తున్నారు. సీపీఎం నిర్ణయం తెలియాల్సి ఉంది. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నా తెలంగాణలో కాంగ్రెస్ తో సీపీఎం కలవని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తు కారణంగానే టీడీపీ గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో గెలిచింది. బీజేపీ గురించి ఇక ఎక్కవ రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చారు. రాష్ట్రంలో షర్మిల బాధ్యతలు చేపట్టినా కాంగ్రెస్ ప్రభావం పెద్దగా ఉండదనే అభిప్రాయం ఈ మూడు పార్టీల నుంచి వ్యక్తం అవుతోంది. దీంతో రానున్న రోజుల్లో ఏపీలో పొత్తు రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+