జగన్ కరుడు గట్టిన నేరస్థుడు..నమ్మితే జైలుకే : ఎన్నికల ఎమర్జెన్సీ : చంద్రబాబు తీవ్ర వ్యాఖ్య
ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత ఇప్పటి వరకు ఉన్న రాజకీయ పోరు హద్దులు దాటుతోంది. ఏపి ము ఖ్యమంత్రి చంద్రబాబు వైసిపి అధినేత జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ప్రతీ రోజు నేరాటు చేయటం వారి కి అలవాటన్నారు. పార్టీ శ్రేణులకు ఇది ఎమర్జెన్సీ సమయమని..ఏ ఒక్కరు నిమిషం కూడా వృధా చేయవద్దని సీయం స్పష్టం చేసారు.
జగన్ కరుడు గట్టిన నేరస్థుడు..
వైసీపీ అధినేత జగన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ కరుడుగట్టిన నేరస్థుడు అని...ఆయన్ని నమ్మితే జైలుకు పంపుతాడని వ్యాఖ్యానించారు. అవినీతి కేసుల్లో జైలుకెళ్లిన జగన్.. తనతోపాటు అనేక మందిని జైలుపాలు చేశాడని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేర చరిత్ర ఉన్న పార్టీ అని దుయ్యబట్టారు. ఆ పార్టీతో పోరాటంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉండరాదన్నారు. ప్రతిరోజూ నేరాలు చేయడం వైసీపీకి అలవాటు అని నిప్పులు చెరిగారు. వాటిని కప్పిపెట్టడానికే మరిన్ని నేరాలు చేస్తున్నారని అన్నారు. నేరగాళ్ల ఆలోచనలు నేరాలు-ఘోరాల మీదే ఉంటాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో కుట్రలు చేసి గెలవాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. చరిత్రలో కుట్రదారులు గెలిచిన దాఖలాలు లేవన్నారు.

ఒక్క నిమిషం వృధా చేయవద్దు
ఈ నెల రోజులు ఎవరికీ సెలవులు లేవని, ఎవరికీ మినహాయింపులు ఉండవని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఒక్క నిమి షం కూడా వృధా చేయరాదని నిర్ధేశించారు. ప్రస్తుతం ఎన్నికల ఎమర్జెన్సీ సమయం అని, ప్రతి ఒక్కరు అవిశ్రాంతం గా పనిచేయాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మీ భవిష్యత్తు - మా బాధ్యత' నినాదంతో ముందుకెళ్దామని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే ఓట్ల నమోదు, తొలగింపునకు ఐదు రోజులే గడువు ఉందని, ఈ ఐదు రోజులు ప్రతి రోజూ ఓట్లు తనిఖీ చేసుకోవాలని, తుది జాబితా దాకా ఓట్లు ఉన్నాయో లేవో చూడాలని పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్టీలో విభేదాలకు తావు ఇవ్వకూడదన్నారు. అందరూ పరస్పరం చర్చించుకొని.. సమన్వయంతో పనిచేయాలని సూచించారు. టీడీపీ గెలుపే లక్ష్యం-మెజారిటీయే ధ్యేయం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications