కేసీఆర్‌..జ‌గ‌న్ లు మోదీ పెంపుడు కుక్క‌లు :పొగ వేసి కేసీఆర్ ను బ‌య‌ట‌కు లాగా : బాబు తీవ్ర వ్యాఖ్య‌లు

కేసీఆర్ ఖ‌బడ్దార్‌. జాగ్ర‌త్త‌. నోటికి హ‌ద్దు లేకుండా మాట్లాడితే తోలు తీస్తా. వంద మంది మోదీలు..500మంది కేసీఆర్‌.. 1000 కోడి క‌త్తిలు కూడా ఏం చేయ‌లేవు. వారం రోజుల పాటు కేసీఆర్ ను తిడితే పొగ పెడితే బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ముసుగు తీసే సాడు. అవిశ్వాసం పెడితే స‌భ జ‌ర‌గ‌కుండా చేసింది వీళ్లే...అంటూ చంద్ర‌బాబు విరుచుకు ప‌డ్డారు.

కేసీఆర్‌..జ‌గ‌న్ పై తీవ్ర వ్యాఖ్య‌లు...
టిడిపి అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చివ‌రి రోజు తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. తెలంగాణ ముఖ్య‌మం త్రి కేసీఆర్‌..వైసిపి అధినేత జ‌గ‌న్ పై చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం సృష్టించాయి. కేసీఆర్..జ‌గ‌న్ లు మోదీకి పెంపుడు కు క్క‌లంటూ వ్యాఖ్యానించారు. మోదీ వేసే బిస్కెట్ ల కోసం వీరిద్ద‌రూ ఆశ‌ప‌డుతున్నార‌ని ఆరోపించారు. ఆ బిస్కెట్ లు తింటూ జ‌గ‌న్ ఏపికి ద్రోహం చేసేందుకు సిద్ద‌మ‌య్యార‌ని విమ‌ర్శించారు. ఏపిలో జ‌గ‌న్ అడ్ర‌స్ లేకుండా పోతున్నాడ‌ని ఆయ‌న్ను కాపాడుకొనేందుకు ఇప్పుడు కేసీఆర్ ముందుకు వ‌చ్చార‌న్నారు. వారం రోజుల పాటు పొగ వేసి కేసీఆర్ ను తిడితే ఇప్పుడు ముసుగు తీసి బ‌య‌ట‌కు వ‌చ్చాడ‌ని పేర్కొన్నారు. కేసీఆర్ రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్నాడు..ఏపికి రావాల్సిం దిగా కేసీఆర్ ను ఆహ్వానించాన‌ని..వ‌చ్చి ఉంటే నా స‌త్తా చూపించే వాడిన‌ని వ్యాఖ్యానించారు.

Chandra Babu serious comments on KCR and Jagan : Modi and Kcr wants Jagan win

దొంగ చేతికి తాళాలిస్తారా..
ఒక్క సారి అవ‌కాశం ఇవ్వాలంటూ జ‌గ‌న్ అడుగుతున్నార‌ని..ఎందుకు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ కు కేసీఆర్ వెయ్యి కోట్లు డ‌బ్బులు ఇచ్చి..ల‌క్ష కోట్లు ఎగ్గొడుతారా అని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ గెలిస్తే పోల‌వ‌రం ఆగిపోతుంది.. అమ‌రావ‌తి నిర్మాణం ఆగిపోతుంది అని వివ‌రించారు. జ‌గన్ అవ‌కాశం కోరటం ద్వారా కేసుల నుండి ర‌క్ష‌ణ కోస‌మా అని నిల‌దీసారు. ఎన్నిక‌ల్లో డ‌బ్బులు గెలిపించ‌లేవ‌ని.. మ‌న ప‌ధ‌కాలే మ‌నల్ని గెలిపిస్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేసారు. కేసీఆర్ ఏం చేయ‌క‌పోయినా 88 సీట్లు గెలిచాడ‌ని.. ఇంత అభివృద్ది చేసిన త‌న‌కు ఎన్ని సీట్లు రావాల‌ని ప్ర‌శ్నించారు. మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో తానే అభ్య‌ర్దిగా భావించాల‌ని.. మొత్తం 25 లోక్‌స‌భ స్థానాల్లో టిడిపిని గెలిపించాల‌ని చంద్ర‌బాబు కోరారు. మోదీ ముందు త‌ల దించుకొనే ప‌రిస్థితి తీసుకురావ‌ద్ద‌ని అభ్య‌ర్దించారు. రోషం తో పౌరుషం తో టిడిపికి ఓట్లు వేసి గెలిపించాల‌ని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+