చంద్ర‌బాబు నోట..నేను ఓడితే..బిస్కెట్ వేస్తే వారికి విశ్వాసంగా జ‌గ‌న్ : మోహ‌న్‌బాబు.ఆలీ.జ‌య‌సుధ ఎవ‌రు

పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర ప‌డే కొద్దీ టిడిపి అధినేత చంద్ర‌బాబు త‌న విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెట్టారు. తాను ఓడిపోతే ఏం జ‌రు గుతుందో చెబుతూనే..తాను ఓడిపోతే ఏం చేస్తానో కూడా చెప్పేసారు. ఇక‌, జ‌గ‌న్ పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసారు. కేసీఆర్‌..మోదీ వేసే బిస్క‌ట్ లు తీసుకొని వారికి విశ్వాసంగా ప‌డి ఉంటార‌న్నారు. ఇక‌, వైసిపి కి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్త‌న్న సినీ ప్ర‌ముఖుల మీద చంద్ర‌బాబు ఫైర్ అయ్యారు..

నేను ఓడితే.. కుటుంబం ఉంది...

నేను ఓడితే.. కుటుంబం ఉంది...

త‌న‌కు డ‌బ్బు మీద వ్యామోహం లేద‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. రాజంపేట ప‌రిధిలో ఎంపీ అభ్య‌ర్ది..పుంగ‌నూరు లో ఓటుకు రెండు వేలు ఇస్తున్నార‌ని..ఎవ‌డ‌బ్బ సొమ్మ‌ని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ‌ద్ద కాంట్రాక్టులు తెచ్చుకొని కాళ్ల ద‌గ్గ ర ప‌డి ఉన్నార‌ని విమ‌ర్శించారు. ఇక‌, మోదీ గురించి మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. తాను ఎన్నిక‌ల్లో ఓడిపోతే త‌న‌కు భార్య‌..కుమారుడు..కోడ‌లు..మ‌న‌వ‌డు ఉన్నార‌ని..వారి ద‌గ్గ‌ర‌కు వెళ్తాన‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌ధాని మోదీ ఓడిపోతే ఎవ‌రి ద‌గ్గ‌ర‌కు వెళ్తార‌ని ప్రశ్నించారు. మోదీ ఉగ్ర‌వాది అని పేర్కొన్న చంద్ర‌బాబు..ఢిల్లీ నుండి గుజ‌రాత్ కు త‌రిమి కొడ తామ‌ని హెచ్చ‌రించారు. పవన్‌ కల్యాణ్‌ని నమ్ముకుంటే అత్తారింటికి పోతారని, తనను నమ్ముకుంటే మీ భవిష్యత్‌ బాగుపడుతుందని చంద్రబాబు ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.

జ‌గ‌న్ కు బిస్కెట్‌ వేస్తే విశ్వాసంగా

జ‌గ‌న్ కు బిస్కెట్‌ వేస్తే విశ్వాసంగా

కోడికత్తి పార్టీకి నరేంద్రమోదీ, కేసీఆర్‌ డబ్బులు ఇస్తున్నారని, ఒక బిస్కెట్‌ వేస్తే జగన్‌ కుక్కలా విశ్వాసంగా ఉంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. కేసీఆర్‌కి జగన్‌ ఎందుకు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకూ ఇవ్వాలని కేసీఆర్‌ అడ్డుపడ్డారని చంద్రబాబు మండిపడ్డారు. నాగార్జునసాగర్‌, శ్రీశైలం కేసీఆర్‌ కంట్రోల్‌లో పెట్టాలంట.. మనం ఏమైనా చేతులు కట్టుకుని కూర్చున్నామ అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ జుట్టు కేసీఆర్‌, మోదీ చేతుల్లో ఉందని చంద్రబాబు విమర్శించారు. జగన్ తప్పులు చేశారు కాబట్టే భయపడుతున్నా రన్నారు. ప్రచారానికి రాకుండా కుట్ర చేయడానికి లోటస్‌పాండ్‌లో ఉన్నారని, డబ్బులు లెక్కపెట్టుకుంటూ కూర్చు న్నారని సీఎం విమర్శించారు.

ఒక్క ఛాన్స్ దేనికి..

ఒక్క ఛాన్స్ దేనికి..

ఒక్క ఛాన్స్ అని వైసిపి నేత‌లు ప్ర‌చారం చేస్తున్నార‌ని..ఎందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌ని ప్ర‌శ్నించారు. ఒక్క సారే అని విషం తాగుతామా..ఒక్క సారే అని ఆత్మ‌హ‌త్య చేసుకుంటామా అని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ కు సంప‌ద ఎలా సృష్టించాలో తెలుసా..జ‌గ‌న్ చూస్తూ పారిశ్రామిక వేత్త‌లు వ‌స్తారా అని నిల‌దీసారు. కేసీఆర్‌..మోదీకి ఊడిగం చేస్తూ జ‌గ‌న్ ఏపికి అన్యా యం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఏపికి అన్యాయం చేయాల‌ని చూస్తే ఊర‌కోమ‌ని హెచ్చ‌రించారు. త‌న పై దాడులు చేయాల‌ని చూస్తున్నార‌ని..అది రాష్ట్రం పై దాడిగా పేర్కొన్నారు. ప్ర‌జ‌లంతా త‌న‌కు అండ‌గా నిల‌వాల‌ని..ఆత్మ గౌర‌వం కాపాడుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఇక‌, వైసిపికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్న మోహ‌న్ బాబు, జ‌య‌సుధ‌, ఆలీ వీరంతా ఎవ‌రని..ఎప్పుడైనా ఏపిలో ఉన్నారా అని ప్ర‌శ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+