గంటా, దేవినేని తో సహా సీనియర్లకు చంద్రబాబు మార్క్ షాక్..!!

టిడిపి మూడో జాబితా విడుదల అయింది. 11 ఎమ్మెల్యే, 13 ఎంపీ స్థానాలకు చంద్రబాబు తమ అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో పలువురు సీనియర్లకు సీట్లు దక్కలేదు. ఇప్పుడు ఈ సీనియర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ పెంచుతుంది. మరో ఐదు స్థానాలకు చంద్రబాబు తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

మూడో జాబితాలో : తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో మూడో జాబితా విడుదలైంది. కొద్దిరోజులుగా ఆసక్తికరంగా మారిన మైలవరం, పెనమలూరు స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ఫైనల్ చేశారు. మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ ను ప్రకటించారు. పెనమలూరు నుంచి సీటు లేదని చెప్పిన బోడే ప్రసాద్ కే తిరిగి సీటు కేటాయించారు. మైలవరం నుంచి సీటు పైన ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు చంద్రబాబు భారీ షాకిచ్చారు. మైలవరంలో ఉమా తో పాటుగా బొమ్మసాని సీటు పైన ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వసంతకు సీటు ఖరారు చేయటంతో ఆ ఇద్దరు ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తిని పెంచుతుంది. అదేవిధంగా భీమిలి సీటు కోరుతున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఈ జాబితాలో చోటు దక్కలేదు.

Chandra babu shock for party senior leaders over announcing thirs list of contesting candidates

గంటా కు సీటు లేనట్లేనా : చీపురుపల్లి నుంచి గంటాను పోటీ చేయాలని చంద్రబాబు ఇప్పటికే సూచించారు. కానీ, గంట చీపురుపల్లి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరు. విశాఖ జిల్లా పరిధిలో సీటు కేటాయించాలని కోరుతున్నారు. దీంతో ఈ జాబితాలో భీమిలితో పాటుగా చీపురుపల్లి స్థానం కూడా ఎవరికి కేటాయించలేదు. తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34, మూడో జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు టిడిపి అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. టిడిపి ప్రకటించాల్సిన నియోజకవర్గాల్లో అనంతపురం, చీపురుపల్లి, దర్శి, రాజంపేట, రైల్వే కోడూరు ఉన్నాయి. దీంతో గంట ఇంకా తనకు భీమిలి స్థానం దక్కుతుందని ఆశతో ఉన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు సీటు కష్టంగానే కనిపిస్తుంది.

Chandra babu shock for party senior leaders over announcing thirs list of contesting candidates

సీనియర్ల రూటెటు : టిడిపి ఏపీ అధ్యక్షుడుగా పనిచేసిన కళా వెంకట్రావుకు ఇక అవకాశం లేనట్లే. మరో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఆయన సొంత నియోజకవర్గం సర్వేపల్లి నుంచి మరోసారి అవకాశం దక్కింది. గుంటూరు జిల్లా నరసరావుపేట స్థానం తిరిగి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు కేటాయించారు. జనసేన, బిజెపి తమకు కేటాయించిన స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. మూడు పార్టీల మధ్య కొన్ని స్థానాల్లో అటు ఇటు మార్పు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది ‌ దీంతో, తొలి జాబితా పైన సీనియర్లు ఇంకా ఆశలు పెట్టుకున్నారు. ఇక రెండు రోజుల్లోనే మొత్తం అభ్యర్థుల జాబితా ఫైనల్ చేయాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించారు. సీట్లు దక్కని సీనియర్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+