బాబు పై రిటైర్డ్ ఐఏయస్ ల ఆగ్రహం : అధికారులను అవమానిస్తారా: ఉపసంహరించుకోండి..!
ఏపి ముఖ్యమంత్రి తాజాగా అధికారుల పై చేసిన వ్యాఖ్యల పై రిటైర్డ్ ఐఏయస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోవర్ట్ అనటం.. ఎన్నికల ప్రధానాధికారి తో బెదిరింపు ధోరణి తో మాట్లాడారని..వారి పై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేసారు. దీని పై చంద్రబాబు కు లేఖ రాసారు.

సీయస్..సీఈవో పై బాబు అనుచిత వ్యాఖ్యలు..
ఎన్నికల సంఘం ఏపి ప్రభుత్వ సీయస్ పునీఠా ను తప్పించి ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యం ను ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎల్వీ సీయస్ గా కొనసాగ న్నారు. అయితే, తమను సంప్రదించకుండా పునీతాను తప్పించటం..ఎల్వీ సుబ్రమణ్యం ను సీయస్ నియమించటం పై చంద్రబాబు సీరియస్ అయ్యారు. జగన్ సహ నిందితుడు అయిన వ్యక్తిని సీయస్ గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఎల్వీ ని కోవర్ట్ గా చంద్రబాబు అభివర్ణించారు. ఇక, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తో ఎన్నికల ముందు రోజు సమావేశమైన చంద్రబాబు ఆయన తో వ్యవ హరించిన తీరు పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అదే విధంగా మీడియా సమావేశంలోనూ సీఈవో ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చ కు కారణమయ్యాయి.
రిటైర్డ్ ఐఏయస్ ల డిమాండ్..
ఇలా..ఇద్దరు ఐఏయస్ అధికారుల పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల గురించి పదవీ విరమణ చేసిన ఐఏ యస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ వేత్త ..ఇలా అధికారు ల పై వ్యాఖ్యలు చేయటాన్ని వారు తప్పు బట్టారు. దీని పై చంద్రబాబు కు లేఖ రాసారు. అధికారుల పై చేసిన వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేసారు. రిటైర్డ్ అధికారులు అపాలజీ చెప్పాల ని సూచించారు. రిటైర్డ్ అధికారులు భలే రావు, కెవి రావు, టియస్ అప్పారావు, పరీఢా, ఎస్కే సిన్హా, సుతీర్ధ భట్టాచార్య, విద్యా సాగర్, ఎంజి గోపాల్, సివిఎస్‌కె శర్మ, వినోద్ కె అగర్వాల్, జెసి మహంతి, విజయ కుమార్, ఐవైఆర్ కృష్ణారావు లు మీ మేరకు లేఖ రాసారు.












Click it and Unblock the Notifications