కొడాలి, వంశీకి ఇక నో ఛాన్స్, చంద్రబాబు భారీ స్కెచ్- టార్గెట్ 2029..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ 2029 లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఆ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ లతో సమీక్ష చేస్తున్నారు. ముందుగా మచిలీపట్నం పైన సమీక్ష చేసిన చంద్రబాబు.. ప్రత్యేకంగా గుడివాడ.. గన్నవరం నియోజకవర్గాల పైన సేకరించిన సమాచారం పార్టీ నేతల ముందు ఉంచారు. చేపట్టాల్సిన కార్యాచరణ పైన దిశా నిర్దేశం చేసారు. మిషన్ 2029 లో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో తిరిగి సీట్లు నిలబెట్టుకోవాలని సీఎం నేతలకు తేల్చి చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. కీలక నియోజకవర్గాల క్షేత్ర స్థాయి నివేదికలతో సమీక్షలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయం లోనే ఎమ్మెల్యేలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ప్రతీ అసెంబ్లీలో ఎమ్మెల్యే పని తీరు.. పార్టీ పరిస్థితి.. సర్వే తాజా నివేదికల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, ఇన్‌చార్జి మంత్రితో సమావేశాలు ప్రారంభించారు. ఒక్కొక్కరి ప్రోగ్రెస్ రిపోర్టులను సిద్ధం చేశారు. మచిలీపట్నం లోక్‌సభ నియోజక వర్గ నేతలతో వారి క్షేత్ర స్థాయి నివేదికలను వివరిస్తూ... వారికి రోడ్ మ్యాప్ ఫిక్స్ చేసారు. ఎమ్మెల్యే ల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టులను సీల్డ్ కవర్లలో వారికి అందజేశారు. మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పామర్రు, పెనమలూరు, గుడివాడ నియోజకవర్గాల పనితీరు బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. మచిలీపట్నం, గన్నవరం, పెడన సెగ్మెంట్ల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని మరింత మెరుగుపరచుకోవాలని సూచించారు.

చంద్రబాబు టార్గెట్ 2029.. కీలక దిశా నిర్దేశం
కాగా, అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల నడుమ సమన్వయం పూర్తిగా లోపించిందని, వెంటనే సరి దిద్దుకోవాలని సూచించారు. అక్కడి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్లినా.. టీడీపీ వారిని కలుపుకొని వెళ్లడంలో అంత చొరవ చూపడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ జిల్లా ఎమ్మెల్యేలకు అందు బాటులో ఉండడం లేదన్నారు. ఆయన జిల్లాకు వచ్చేది కూడా తక్కువేనని చెప్పారు. ఇకపై ఆయన పద్ధతి మారాలని హెచ్చరించారు. కలెక్టర్ పనితీరు బాగుందని ఎమ్మెల్యేలందరూ చెప్పారు. ఎస్పీ పనితీరుపై కొందరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. అన్నీ సరిదిద్దుతానని సీఎం హామీ ఇచ్చారు. ఇక.. రాజకీయంగా గన్నవరం నుంచి వల్లభనేని వంశీ.. గుడివాడ నుంచి కొడాలి నాని తిరిగి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గాల పైన టీడీపీ నాయకత్వం స్పెషల్ ఫోకస్ చేసింది. 2024 ఎన్నికల్లో ఈ ఇద్దరినీ టీడీపీ అభ్యర్ధులు ఓడించారు. కాగా, వచ్చే ఎన్నికల్లోనూ ఇదే ఫలితం రిపీట్ చేయాలని టీడీపీ పట్టుదలతో ఉంది. దీంతో.. రానున్న రోజుల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో చోటు చేసుకునే రాజకీయం ఆసక్తి కరంగా మారనుంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications