Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వరద బాధితుల రుణాలు, ఈఎంఐలపై కీలక నిర్ణయం..!!

వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ఉపశమన చర్యలు మొదలయ్యాయి. వరద తగ్గటంతో సహాయ చర్యలు ముమ్మరం చేసారు. బాధితులు తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఆకస్మిక వరద కారణంగా ఇంట్లో వస్తువులను నష్టపోయారు. పెద్ద సంఖ్యలో ప్రాణ - ఆస్తి నష్టం జరిగింది. ఇదే సమయంలో బాధితులకు రుణాల రీషెడ్యూల్ తో పాటుగా ఈఎంఐల వసూళ్ల పైన సీఎం చంద్రబాబు బ్యాంకర్లను కీలక సూచన చేసారు. క్లెయిమ్స్ పైన భీమా కంపెనీలకు సూచించారు.

బ్యాంకర్లతో భేటీ
వదర ప్రభావిత ప్రాంతాల్లో భారీగా నష్టపోయిన ప్రజలకు మద్దతుగా నిలవాలని సీఎం చంద్రబాబు కోరారు. నిబంధనలు సరళతరం చేసి ప్రజలకు రుణాలు ఇవ్వాలని కోరారు. వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో సాయం చేసేందుకు బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో కలెక్టరేట్​లో చంద్రబాబు భేటీ అయ్యారు. బుడమేరు వరద కారణంగా వేలాది ఇళ్లు నీట మునిగిన వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు కోల్పోయాయని సీఎం వివరించారు. వరదల్లో దెబ్బతిన్న వాహనాలకు 10 రోజుల్లో వాహన, ఇతర బీమాను సెటిల్ చెయ్యాలని సూచించారు.

Chandra Babu suggests Bankers to Reschule the loans for Flood Effected people

రుణాల రీషెడ్యూల్
బీమా ఉన్న వారికి, లేని వారికి రెండు కేటగిరీలుగా చేసి ఎలా సహాయం చేయాలో ఆలోచిస్తున్నట్లు తెలిపారు. వరద బాధితులకు వీలైనంత ఎక్కువగా సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్​బీఐతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోందని పేర్కొన్నారు. ఆకస్మిక వరదలతో చాలా చోట్ల ద్విచక్ర వాహనాలు, కార్లు పూర్తిగా నీటమునిగాయని కుటీర పరిశ్రమలు నడుపుకునే వారి సామగ్రి మొత్తం నీటి పాలైందని సీఎం చంద్రబాబు అన్నారు. ఫ్రిడ్జ్​లు, టీవీలు, ఏసీలు వంటి అనేక గృహోపకరణాలు పాడైపోయాయని అందరికీ 14 రోజుల్లో క్లెయిమ్స్ పరిష్కరించాలని సీఎం స్పష్టం చేశారు.

బ్యాంకర్ల సాయం
ఆన్​లైన్ విధానం ద్వారా త్వరతగతిన అవసరమైన ప్రక్రియ పూర్తి చెయ్యాలని పేర్కొన్నారు. వరద బాధిత ప్రాంత ప్రజల రుణాలు కాల పరిమితిని రీ షెడ్యూల్ చెయ్యాలని కోరారు. యుద్ధ ప్రాతిపదికన రుణాలు మంజూరు చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల్లో బాధితులు క్లెయిమ్​ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. వినియోగదారుల వద్ద ఉన్న డేటాతో పాటు మునిసిపల్ శాఖ, రవాణా శాఖల వద్ద ఉన్న డేటా సహాయంతో క్లెయిమ్​లకు దరఖాస్తు చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రతిపాదనల పైన బ్యాంకర్లు..భీమా కంపెనీలు తమ నిర్ణయాన్ని రెండు రోజుల్లో వెల్లడించనున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+