పదవుల్లో ఉండాలంటే..తేల్చి చెప్పిన చంద్రబాబు, డెడ్ లైన్..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు కీలక హెచ్చరిక చేసారు. భవిష్యత్ కార్యాచరణ నిర్దేశించారు. పార్టీ కంటే ఎవరూ ముఖ్యం కాదని తేల్చి చెప్పారు. నిర్లక్ష్యంగా ఉంటే ఎవరైనా పక్కకే అని స్పష్టం చేసారు. క్యాడర్‌ను ఎవరూ విస్మరించకూడదని..తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని చంద్రబాబు సూచించారు. పార్టీలో కార్యకర్తే అధినేత అని పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో పార్టీలో కొత్త పదవులు వచ్చిన వారికి కీలక దిశా నిర్దేశం చేసారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు కీలక సందేశం ఇచ్చారు. గత ప్రభుత్వంలో కార్యకర్తలు కష్టాలు పడ్డారని చెప్పుకొచ్చారు. ఇబ్బందులు ఎదుర్కున్నారని గుర్తు చేసారు. రక్తం చిందించార ని.. త్యాగాలు చేశారని వివరించారు. పార్టీలో ఎవరికి ఏ పదవి ఇచ్చినా కార్యకర్తల అభిప్రాయానికి పెద్ద పీట వేస్తున్నామని వివరించారు. సమర్థ నాయకులు తయారు కావడానికి టీడీపీ వేదికగా నిలుస్తుందని చెప్పారు.

పొలిటికల్ గవర్నెన్స్‌లో పార్లమెంటరీ కమిటీలు కీలకమని వివరించిన చంద్రబాబు..ఆ నియోజకవర్గం పరిధిలో చేపట్టే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయా కమిటీల అధ్యక్షులతో ఎమ్మెల్యేలు, ఎంపీలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ కమిటీలు మిత్రపక్షాలైన జనసేన, బీజేపీతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహించా లని స్పష్టం చేసారు. పదవులు తీసుకున్నవారి పనితీరును 3 నెలలకోసారి అధ్యయనం చేస్తామని చెప్పారు. సరిగా చేయకపోతే పక్కన పెట్టి, మరొకరికి అవకాశమిస్తామని హెచ్చరించారు.
మూడు నెలల డెడ్ లైన్
పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదని చంద్రబాబు స్పష్టం చేసారు. ఎవరు నిర్లక్ష్యం వహించినా పక్కన పెడతానని హెచ్చరించారు. పార్టీ సిద్ధాంతానికి అందరూ కట్టుబడి పనిచేయాలని సూచించారు వచ్చిన అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత నాయకత్వం, శ్రేణులపై ఉందని పేర్కొన్నారు. నాయకులెవ్వరూ క్యాడర్‌ను విస్మరించకూడదని... ఎవరికి కేటాయించిన పదవుల్లో వారే పని చేయాలని చెప్పిన చంద్రబాబు... కావాలని ఎక్కడైనా వివాదాలు సృష్టిస్తే పక్కన పెడతామని సీఎం హెచ్చరించారు. ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే రద్దు చేశామని చంద్రబాబు వివరించారు.
గత ప్రభుత్వం లోపభూయిష్టమైన చట్టాన్ని తెచ్చిందన్నారు. ఎవరికైనా అన్యాయం జరిగితే ఎక్కడా చెప్పుకోకుండా హైకోర్టుకు మాత్రమే వెళ్లాలని పేర్కొందని... ఇది సామాన్యులకు సాధ్యమేనా అని ప్రశ్నించారు. మనం చేసే పనులు ఎంత ముఖ్యమో తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడం కూడా అంతే ముఖ్యమని చెప్పిన చంద్రబాబు..అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమం జరిగినా కార్యకర్తలు ఓనర్‌షిప్ తీసుకోవాలని పార్టీ కేడర్ కు నిర్దేశించారు.
-
సాష్టాంగ ప్రణామం.. ఆంధ్రుల ఆత్మగౌరవానికి దక్కిన విజయం -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. అలా చేస్తానంటూ వైసీపీ నేత వార్నింగ్ ! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్ -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..! -
జగన్ 'మావిగన్' ప్రతిపాదన వెనుక, కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ











Click it and Unblock the Notifications