స్పీకర్ గా నో ఛాన్స్ - రఘురామకు ఏం దక్కనుంది..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు పార్టీల కూటమి ప్రభుత్వంలో భాగంగా ఆచి తూచి నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ప్రతీ ఎంపికలోనూ సామాజిక - ప్రాంతీయ సమీకరణాల కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు పేరు ఖరారైంది. డిప్యూటీ స్పీకర్ గా జనసేనకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో, రఘురామకు దక్కే పదవి పైన చర్చ మొదలైంది.
చంద్రబాబు కసరత్తు
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, బీసీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారుచేసినట్లు సమాచారం. అయ్యన్న తాజా ఎన్నికల్లో గెలవటం ద్వారా అసెంబ్లీలో అడుగు పెట్టటం ఇది ఏడోసారి. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో పని చేస్తున్న అయ్యన్న 1983, 85, 94, 99, 2004, 14, 24ల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1996లో అనకాపల్లి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో పనిచేశారు. ఇటీవలి మంత్రివర్గంలో ఆయనకు అవకాశం దక్కలేదు. గత ఐదేళ్లలో మాజీ సీఎం జగన్ పైన ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

సీనియర్లకు ప్రాధాన్యత
ఇక, డిప్యూటీ స్పీకర్ పదవి మిత్రపక్షం జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ పార్టీ నుంచి పంతం నానాజీ, లోకం మాధవి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సామాజిక సమీకరణాల్లో భాగంగా లోకం మాధవికి ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే, అయ్యన్న..మాధవి ఉత్తరాంధ్ర ప్రాంతం కావటంతో గోదావరి జిల్లాలకు డిప్యూటీ ఇచ్చే అంశం తెర మీదకు వచ్చింది. దీంతో..పంతం నానాజీ పేరు చర్చల్లో ఉంది. పవన్ ఈ ఎంపిక పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో, స్పీకర్..డిప్యూటీ స్పీకర్ దాదాపు ఖరారు కావటంతో రఘురామ రాజుకు ఏ పదవి ఇస్తారనేది చర్చగా మారింది.

రఘురామకు పదవి
చంద్రబాబు ఇప్పటికే రఘురామ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో క్షత్రియ సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కలేదు. దీంతో..ఈ వర్గానికి టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవి అప్పగిస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇందుకు అశోక్ గజపతి రాజు..రఘురామ పేర్ల పైన చర్చ సాగుతోంది. దీంతో పాటుగా రాజధాని అమరావతి వ్యవహారాల్లో రఘురామకు బాధ్యతలు ఇవ్వనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో ప్రాంతీయ బోర్డుల నియామకం..ఛైర్మన్ల ఖరారు పైన చర్చ సాగుతోంది. ఒకటి, రెండు రోజుల్లోనే రఘురామకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"











Click it and Unblock the Notifications