వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంపు గ్రామాల్లో చంద్రబాబు - బోటులో పర్యటన : రెండు రోజులు అక్కడే..!!

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజులు గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. భారీ వర్షాలు..గోదావరి వరదలతో ముంపుకు గురైన ప్రాంతాల్లో బాధితులను చంద్రబాబు పరామర్శించనున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు..పార్టీ శ్రేణులు బాధితులకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తొలి రోజు పర్యటనలో భాగంగా కోనసీమ..పశ్చిమ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. లంక గ్రామాల్లో సిద్ధాంతం నుంచి కరుగోరు మిల్లు చేరుకొని అక్కడ నుంచి గోదావరి మధ్యలో ఉన్న అయోధ్య లంకకు వెళ్లనున్నారు.

బోటులో చంద్రబాబు పర్యటన

అక్కడి నుంచి బోటులో కోనసీమ జిల్లా చాకలి పాలెం చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో మానేపల్లి పాలానికి వెళ్తారు. అక్కడ గోదావరిలో ఇద్దరి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం
ప్పనపల్లి చేరుకోనున్నారు. అప్పనపల్లిలో వరద బాధిత కుటుంబాలను పరామర్శించి... రోడ్డు మార్గంలో రాజోలు వెళ్లి ఇక్కడ నుంచి రాత్రికి పాలకొల్లు చేరుకొనే షెడ్యూల్ ఖరారు చేసారు. ఈ పర్యటన సమయంలో బాధితులకు ఎన్టీఆర్ ట్రస్టు తరపున సాయం అందించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి వదర బాధితులకు సాయం పైన విమర్శలు గుప్పించారు.

ప్రభుత్వం పైన విమర్శలు

ప్రభుత్వం నిద్ర పోతోందంటూ దుయ్యబట్టారు. నాలుగంటే నాలుగే అంటూ... ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం గురించి చంద్రబాబు తాజాగా ట్వీట్ లో ధ్వజమెత్తారు. రెండో రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం.. యలమంచిలి మండలంలో చంద్రబాబు పర్యటిస్తారు. దొడ్డిబట్ల, అబ్బిరాజుపాలెం, గంగాధరపాలెం, లక్ష్మీపురంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. నరసాపురం పరిధి పొన్నపల్లిలో చంద్రబాబు పర్యటన ముగియనుంది. ఆకస్మిక వరదల కారణంగా.. వందల గ్రామాల్లో తీవ్ర ఆస్తి నష్టం వాటిళ్లింది. ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

రెండు రోజులు అక్కడే మకాం

రెండు రోజులు అక్కడే మకాం


సముద్రంలోకి 15.21 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఆరు జిల్లాల్లోని 405 గ్రామాలపై వరదల ప్రభావం పడగా.. 326 గ్రామాలు నీట మునిగాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 165 గ్రామాలు ముంపు బారిన పడగా.. అందులో 143 నీటిలో మునిగినట్లు తెలిపింది. వరదల కారణంగా ఆరు జిల్లాల పరిధిలో 27 వేల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ నివేదిక వెల్లడించింది.

English summary
TDP Chief Chandra Babu Visit Flood Effected Villages in Godavari Dsitricts today and Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X