చంద్రాబాబు వర్సెస్ కన్నా:కన్నా పంచ్ డైలాగులు...చంద్రబాబు సెటైర్లు
విజయవాడ:టిడిపి అధినేత చంద్రబాబు బిజెపిపై విమర్శల జోరు పెంచారు. మొదటి రోజు రెండో రోజు బిజెపి అగ్రనేతలకు హెచ్చరికలు జారీ చేసిన చంద్రబాబు మూడో రోజు సమావేశాల్లో ఎపి బిజెపి నూతన అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను లక్ష్యంగా చేసుకొన్నారు.
అసలు తెలుగుదేశం పార్టీపై విమర్శించే హక్కే కన్నాకు లేదన్నారు. కన్నా మహానాడును మాయానాడుగా అభివర్ణించడంపై చంద్రబాబు మండిపడ్డారు. ఆ పార్టీ ఈ పార్టీ అంటూ తిరిగిన కన్నా...అద్దె మైకు...సొంత మైకు అంటూ చంద్రబాబు సెటైర్లు వేశారు.

చంద్రబాబుకు కన్నా పంచ్ లు
తొలుత ఎపి బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్టంలో 4 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు చేసేది మహానాడు కాదని మాయనాడు అనే కార్యక్రమం చేస్తున్నారన్నారు.
అక్కడ కూడా చంద్రబాబు 4 ఏళ్ల పాలనలో ఏమి చేశారు, మిగిలి ఉన్న సంవత్సర కాలంలో ఏమి అభివృద్ది చేయబోతున్నారు అనేది చెప్పుకోవాలి గాని, మాయనాడు కార్యక్రమం పెట్టి రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడన్నారు.ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఈ మాయనాడు నిర్వహించి ఆయన ఆత్మ శోభించే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. కర్నాటక లో తాము ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని చంద్రబాబు సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నాడన్నారు.

చంద్రబాబు దుర్మార్గుడు:కన్నా
ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏజంట్ గా చేరిన చంద్రబాబు తనకు పిల్ల నిచ్చిన మామ ఎన్టీఆర్ నే వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు అన్నారు.కర్ణాటక వెళ్లి కాంగ్రెస్ పార్టీ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగి మళ్లీ ఇక్కడికి వచ్చి తొడలు కొడతారు. ఏమి సాధించారాని తొడలు కొడుతున్నారో మాకు అర్ధం కావడం లేదు. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల్లో ఒక దోషిలా,భూతంలా, నిలబెట్టి తన సొంత రాజకీయ లబ్ధి కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు.చంద్రబాబు ఒక అపరిచితుడులా రోజుకో మాట పూటకో బాట అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ తో చెట్టాపట్టాలేసుకుని డాన్సులు వేస్తున్నాడని ఎద్దేవా చేశారు.రాష్ట్రములో చంద్రబాబు చేస్తున్న దుర్మార్గపు పాలనకు నిదర్శనం పోలవరం అన్నారు.

కన్నాపై...చంద్రబాబు సెటైర్లు
తనను లక్ష్యంగా చేసుకొని ఎపి బిజెపి నూతన అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన విమర్శలపై చంద్రబాబు ప్రతిస్పందించారు. కన్నా మాటకు మాటలా చంద్రబాబు ఆయనపై తీవ్ర స్థాయిలో ప్రతి విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన జరిగే సమయంలో కాంగ్రెస్ లో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా మౌనంగానే ఉన్నారన్నారు. మొన్నటికి మొన్న వైసీపీలోకి వెళ్లేందుకు ఫ్లెక్సీలు కూడా వేయించుకుని రెడీ అయిపోయిన కన్నా, ఆ తర్వాత ఆసుపత్రిలో చేరి, చివరకు బీజేపీలోనే ఉన్నారన్నారు. అటువంటి కన్నాలక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదన్నారు. అసలు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి అద్దె మైకు, వైసీపీకి సొంత మైకుగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు సెటైర్లు వేశారు.

భవిష్యత్ పరిణామాలపై...ఉత్కంఠ
మిత్ర పక్షాల నుంచి శత్రు పక్షాలుగా మారిన టిడిపి-బిజెపి మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరడంతో ఎపిలో భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై తీవ్ర విమర్శలకు దిగిన నేపథ్యంలో కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా?...ఏదేని చర్యలకు దిగుతుందా అనే మిగిలిన రాజకీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. టిడిపి విమర్శలకు ప్రతిగా బిజెపి చర్యలు తీసుకునే పక్షంలో అవి ప్రజలు కన్విన్స్ చేసే విధంగా లేకుంటే బిజెపికే నష్టం కలుగుతుందని, టిడిపిపై బిజెపి ఆరోపిస్తున్న విధంగా అవినీతిని జనాల ముందు ససాక్ష్యంగా బహిర్గతం చేయగలిగిన పక్షంలో అప్పుడు బిజెపికి లాభించినా లాభించకున్నా టిడిపికి మాత్రం నష్టం వాటిల్లుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications