వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొండాకు బాబు హెచ్చరికలు సరే: లోకేశ్ ప్లస్ అఖిలప్రియ మాటేమిటి?

బొండాతో భేటీ అయిన చంద్రబాబు.. తొలిసారే శాసనసభకు ఎన్నికైన వారికి కేబినెట్‌లో చోటు కావాలని తొందరపడటం ఎందుకని మండిపడ్డారని మీడియాలో వార్తలు వచ్చాయి. మరి వారి సంగతేమిటి...

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అమరావతి / హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో అధికార తెలుగుదేశం పార్టీలో లుకలుకలు.. తెలుగు తమ్ముళ్లలో అసమ్మతి ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడింది. మరో రెండేళ్లలో అసెంబ్లీ, లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుది.

అదే సమయంలో పార్టీలోని అన్ని వర్గాలు, కులాల వారిని, ప్రాంతాల వారిని కలుపుకుని వెళ్లి సమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆయనదే. కానీ తనకు ఇష్టులైన వారికి తొలి ప్రాధాన్యం ఇస్తూ.. మిగతా వారిని పక్కన బెట్టేశారని.. దానికి ప్రజాస్వామ్య స్ఫూర్తి అనే ముద్దు పేరు తగిలించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. విజయవాడ నగరానికి చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్ రావు తనకు కేబినెట్‌లో చోటు దక్కక పోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారు.

ఆయన్ను బుజ్జగించిన ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ.. సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లే వరకు బాగానే ఉంది. కానీ బొండాతో భేటీ అయిన చంద్రబాబు.. తొలిసారే శాసనసభకు ఎన్నికైన వారికి కేబినెట్‌లో చోటు కావాలని తొందరపడటం ఎందుకని మండిపడ్డారని మీడియాలో వార్తలు వచ్చాయి.

లోకేశ్ నుంచి ప్రతి ఒక్కరికీ ఒకేలా...

లోకేశ్ నుంచి ప్రతి ఒక్కరికీ ఒకేలా...

ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ సమానమే. కానీ ఆ మాటకొస్తే ఆదివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో సీఎం చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. అసెంబ్లీకి కూడా కాదు.. పెద్దల సభగా పేరొందిన శాసనమండలికి ఎన్నికైన అతి పిన్న వయస్కుడు. ఒక ప్రజా ప్రతినిధిగా మిగతా వారి కంటే చాలా జూనియర్ కూడా.. చంద్రబాబు చెప్పినట్లు తొలిసారి ఎన్నికైన వెంటనే కేబినెట్‌లో చోటు కల్పించలేనన్న సిద్ధాంతమే నిజమైతే.. తన కొడుకు లోకేశ్‌కు ఎందుకు అవకాశం ఇచ్చారో మీడియాకు వివరణివ్వాల్సిన బాధ్యత కూడా ఏపీ సీఎందే. కానీ ఇదే మాట మీడియా ముందు చెబితే వెంటనే ప్రశ్నిస్తారన్న సందేహంతోనే కేవలం పత్రికా ప్రకటనతో పార్టీ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేశారన్న సందేహాలు వెలువడుతున్నాయి.

కాపులకు ప్రాధాన్యంపై బాబు

కాపులకు ప్రాధాన్యంపై బాబు

ఇక కాపులకు ఐదుగురికి మంత్రి పదవులిచ్చామని అదే చాలా ఎక్కువ ప్రాధాన్యం అని కూడా బొండా ఉమా మహేశ్వర్‌రావుతో భేటీలో చంద్రబాబు అన్నట్లు సమాచారం. కానీ ఆంధ్రప్రదేశ్ జనాభాలో కమ్మ సామాజిక వర్గంతోపాటు దాదాపు సమానంగా జనాభా గల సామాజిక వర్గం కాపులు. సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం సారథ్యంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉద్యమిస్తున్న తరుణంలో కూడా సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పడంలో బాబు ద్వంద్వ నీతి కళ్లకు కట్టినట్లే కనిపిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

 తొలి మహిళగా అఖిలప్రియ రికార్డు

తొలి మహిళగా అఖిలప్రియ రికార్డు

ఒక కర్నూల్ జిల్లా నుంచి తొలిసారిగా మహిళగా మంత్రి పదవిని అధిష్ఠించిన భూమా నాగిరెడ్డి - శోభా నాగిరెడ్డి దంపతుల కూతురు భూమా అఖిలప్రియ కూడా మొదటిసారే అసెంబ్లీకి ఎన్నికైనా లోకేశ్‌బాబుతో పోలిస్తే చట్టసభకు ఎన్నికైన ప్రతినిధిగా సీనియర్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందే తమకు మంత్రి పదవిలో చోటు కల్పించాలని భూమా నాగిరెడ్డి షరతు పెట్టారని సమాచారం. అయితే ఆయన హఠాన్మరణంతో భూమా నాగిరెడ్డికి ఇచ్చిన మాట కోసం ఆయన కూతురు అఖిల ప్రియకు కేబినెట్‌లో చోటు కల్పించడంపై ఎవరికీ అభ్యంతరం లేదు. ఒక ఉత్సాహ వంతమైన యువతిగా.. కర్నూల్ జిల్లా రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న భూమా దంపతుల తనయగా ఆమెకు కేబినెట్ చోటు కల్పించడంపై శషబిషలు లేవు.

 హెచ్చరికల్లో విస్మరించిన వాస్తవికత

హెచ్చరికల్లో విస్మరించిన వాస్తవికత

అసాధారణ రీతిలో భూమా అఖిలప్రియతోపాటు తన తనయుడు లోకేశ్ మొదటి సారే చట్టసభలకు ఎన్నికైన వారైనా కేబినెట్‌లో చోటు కల్పించామన్న సంగతి గుర్తుండి ఉంటే ‘తొలిసారి ఎమ్మెల్యేకు అంత తొందరెందుకు' అని హెచ్చరికలు జారీ చేసే వారు కాదని రాజకీయ వర్గాల్లో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక కేబినెట్‌లో బెర్త్ లభించలేదని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న బొండా ఉమామహేశ్వర్‌రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి నుంచి వంగలపూడి అనిత వరకు ఒక సారూప్యత ఉన్నది. వీరంతా తమ అధినేత మెప్పు పొందేందుకు.. క్యాబినెట్‌లో చోటు దక్కించుకునేందుకు అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్ జగన్‌పై మూకుమ్మడిగా విమర్శలు గుప్పించిన వారేనంటే అతిశేయోక్తి కాదు.

గోదావరి జలాల తరలింపులో జగన్‌పై గోరంట్ల

గోదావరి జలాల తరలింపులో జగన్‌పై గోరంట్ల

కోస్తాకు గోదావరి నదీ జలాల తరలింపునకు నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వీధి నాయకుడి కంటే అద్వాన్నంగా వ్యవహరిస్తున్నారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దూషణ పర్వానికి దిగారు. గోదారి నది ఒడ్డున ఉన్న తమకు ఎన్ని జలాలు వ్రుధాగా పోతున్నాయో తెలుసునని, వాటిని నిలువరిస్తే కోస్తా డెల్టాకు నీరు తరలించడంతోపాటు రాయలసీమకు ‘మిగులు జలాలు' పంపిణీ చేసేందుకు.. సీమ జిల్లాలను ఆదుకునేందుకు సిద్ధమని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌ను సెంట్రల్ జైలులో గానీ, ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో గానీ చేరిస్తే బాగుంటుందని మండిపడ్డారు. నిత్యం అవినీతికి పాల్పడే జగన్ వంటి వారికి బెంగళూరు ప్యాలెస్‌లు మాత్రమే తెలుసునని, మిగుల జలాల గురించేం తెలుసని ఎద్దేవా చేశారు. మంత్రులపై సభా వేదికగా చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని మరో సందర్భంలో గోరంట్ల అన్నారు. కుదరకపోతే రాజీనామా చేసి బయటకు వెళ్లిపోవాలని సవాల్ చేశారు. కానీ మంత్రి పదవిలో చోటు దక్కకపోయే సరికి పలుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినా కేబినెట్ లో చోటు దక్కకపోతే ఎలా? అని వాపోయారు.

 జగన్ ను 420గా అభివర్ణించిన బొండా

జగన్ ను 420గా అభివర్ణించిన బొండా

అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో బొండా ఉమా మహేశ్వర్ రావు ముందు వరుసలో నిలుస్తారు. వైఎస్ జగన్‌ను ‘420' అని సీబీఐ న్యాయస్థానం అభివర్ణించిందని బొండా వ్యాఖ్యానించారు. దీనిపై అభియోగాలు నమోదయ్యాయే గానీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇంకా తీర్పు చెప్పలేదు. కానీ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చేసినట్లు బొండా ఉమా మహేశ్వర్ రావు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచే దుర్మార్గాలకు పాల్పడిన చరిత్ర వైఎస్ జగన్మోహనరెడ్డిదని దుమ్మెత్తిపోశారు. అవినీతి కేసులో జైలుకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి ఖైదీ నంబర్ 6093 కాదా? అని బొండా నిలదీశారు. అడ్డగోలుగా రోజుల తరబడి అసెంబ్లీని స్తంభింపజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రగతి, ఉపాధి కావాలంటూనే.. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని రెచ్చగొడ్తున్నారని మండిపడ్డారు. ఆక్వా ఫుడ్ కోర్టు, బందర్ పోర్టు తదితర ప్రాజెక్టులను జగన్ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. తన వ్యాఖ్యలకు అడ్డు తగిలిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై కూడా ఎదురు దాడికి దిగారు. కానీ మంత్రి పదవి దక్కక పోవడంతో ఖిన్నుడైన బొండా ఉమామహేశ్వర్‌రావు.. ఇక తనను టీవీ చానెళ్లలో చర్చలకు, ఇంటర్వ్యూలకు పిలువొద్దని మీడియాకు ‘సోషల్ మీడియా' ద్వారా ప్రకటన చేశారు.

రోజాపై టీడీపీ ఎమ్మెల్యే అనిత ఇలా

రోజాపై టీడీపీ ఎమ్మెల్యే అనిత ఇలా

వైఎస్ జగన్మోహనరెడ్డిని నిలువరించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్ కే రోజాపై విమర్శలు చేసిన వారిలో వంగలపూడి అనిత ఒకరు. సీఎం చంద్రబాబును, రాష్ట్రప్రభుత్వాన్ని తిట్టడం కోసం రోజా వంటి వారు జగన్మోహన్ రెడ్డికి అవసరమని ఆమె ఆరోపించారు. ఇప్పటికే ఏడాది పాటు సస్పెన్షన్ వేటుకు గురైన రోజా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఎదురు దాడికి దిగారు. తనకు రోజా సానుభూతి అవసరం లేదని.. పరిస్థితి అర్థం చేసుకోలేకపోతున్న రోజాకే తాను సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఒకరిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలవాటని, తమకు, తమ అధినేత చంద్రబాబుకు ఆ అవసరం లేదని పేర్కొన్నారు. తాను నవ్యాంధ్ర, స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు పావుగా వ్యవహరిస్తున్నానని అనిత వ్యాఖ్యానించారు. పదేపదే వైఎస్ జగన్, రోజాలపై విమర్శలు గుప్పించిన అనితకు మంత్రి పదవి లభిస్తుందని పార్టీ శ్రేణులు, బంధు మిత్రులు ముందే ఆమెకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

English summary
AP CM Chandrababu warned party mla's not to cross laxmanrekha while he ordered to strictly follow party disipline and took democratic spirit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X